Former Defence Minister AK Antony's son Anil joined BJP
Anil Antony:కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ రక్షణమంత్రి ఏకే ఆంటోని (ak antony) కుమారుడు అనిల్ ఆంటోని (Anil Antony) బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కేరళ బీజేపీ చీఫ్ వీ మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనిల్ ఆంటోనికి సురేంద్రన్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీలో అన్నీ పదవులకు అనిల్ రాజీనామా చేశారు. ప్రధాని మోడీపై (modi) బీబీసీ తీసిన డాక్యుమెంటరీని అనిల్ (anil) అప్పట్లో ఖండించారు. ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది. తాను చేసిన ట్వీట్ వెనక్కి తీసుకోనని.. జనవరిలోనే పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
డాక్యుమెంటరీని ఇండియాలో (india) ప్రమోట్ చేయడాన్ని గతంలో అనిల్ తప్పుపట్టారు. తమకు బీజేపీతో (bjp) విభేదాలు ఉన్న.. భారతదేశంపై బీబీసీ వ్యక్తం చేసిన అభిప్రాయం సరిగా లేదన్నారు. ట్వీట్ చేసిన సమయంలో అనిల్ కేరళ కాంగ్రెస్ డిజిటల్ మీడియా ఇంచార్జీగా (kerala congress digital media incharge) ఉన్నారు. సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. ట్వీట్ వెనక్కి తీసుకోవాలని కోరినా.. వినలేదు.
సనాతన భారతీయతపై బీబీసీ (bbc) అబిప్రాయం మన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేదిగా ఉందని అనిల్ తెలిపారు. భావ ప్రకటన స్వేచ్చ కోసం పోరాడుతున్న నేతలు.. ట్వీట్ (tweet) తొలగించాలని కోరడం బాగోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో (congress party) వంతపాడేవారు ఎక్కువ అయ్యారని పేర్కొన్నారు.
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ రెండు భాగాలతో డాక్యుమెంటరీ రిలీజ్ చేసింది. అందులో నిష్పాక్షికత లోపించిందని పేర్కొంది. యూట్యూబ్, ట్విట్టర్ పోస్టులపై కేంద్రం నిషేధం విధించింది. బీబీసీ డాక్యుమెంటరీ తర్వాత.. దేశంలో గల కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.