తమకు ఆడపిల్ల (baby girl) పుట్టకపాయే అని బాధపడే చాలామంది తల్లిదండ్రులను చూసి ఉంటాం. కానీ 138 ఏళ్లుగా ఓ ఫ్యామిలీ ఆడపిల్ల కోసం వేచి చూసిన ఘటన అమెరికాలో చోటు చేసుకున్నది. ఇన్నాళ్లకు వారి ఇంట్లో ఆడపిల్ల పుట్టడంతో ఆ తల్లిదండ్రుల సంతోషం అంతా ఇంతా కాదు.
సెప్టెంబర్ 2022లో అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో ఓ ఫ్యామిలీ (Michigan based family ) మొత్తం జెండర్ రివీల్ పార్టీ కోసం సమావేశమైంది. ఆ సమయంలో ఆడపిల్ల పుట్టబోతుందని తెలుసుకొని చాలామంది సంతోషపడ్డారు. కానీ ఎక్కడో వారిలో అపనమ్మకం. ఎందుకంటే ఆ వంశంలో కొన్ని తరాలుగా ఆడపిల్ల పుట్టలేదు (US family welcomes newborn daughter). అందరూ మగపిల్లలే. ఇప్పుడు ఆడపిల్ల పుడుతుందని భావించారు. వారి ఆశలను రెట్టింపు చేస్తూ మార్చి 17వ తేదీన ఆ కుటుంబంలోకి ఆడపిల్ల వచ్చింది. కరోలీన్, ఆండ్రూ క్లార్క్ తల్లిదండ్రులు ఆడ్రీ అనే పాపను ఈ ప్రపంచంలోకి స్వాగతించారు. అమెరికాలోని కలడోనియాలో వీరు కుటుంబం నివసిస్తోంది. 1885లో ఈ కుటుంబంలో ఆడపిల్ల పుట్టలేదు. ఇప్పుడు ఈ దంపతులకు బేబీ గర్ల్ జన్మించడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు.
గుడ్ మార్నింగ్ అమెరికా సంభాషణలో నవజాత శిశువు తల్లి తన ప్రస్తుత భర్తతో డేటింగ్ చేస్తున్నప్పుడు.. వారి కుటుంబం ఆడపిల్ల కోసం ఎదురు చూస్తున్న విషయం చెప్పాడని, కానీ తొలుత ఈ విషయాన్ని తాను నమ్మలేదని చెప్పింది. ప్రతిసారి 50 – 50 శాతం అవకాశాలు ఉంటాయి కదా అని తాను భర్తతో వాదించానని, కానీ ఆయన మాత్రం 100 ఏళ్లకు పైగా తమ ఇంట్లో ఆడకూతురు లేదని చెప్పాడని గుర్తు చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో క్లార్క్ ప్రెగ్నెన్సీ అండ్ జెండర్ రివీల్ కోసం సమావేశమయ్యామన్నారు. తాను గర్భం ధరించినప్పుడు ఆడపిల్ల పుడతాడా లేదా అమ్మాయా అనే విషయాన్ని తాను పట్టించుకోలేదని చెప్పాడు. కానీ పాప పుట్టడం నిజంగా ఆనందం వేసిందన్నారు. ఇంతకుముందు అమ్మాయి పేరు పెద్దగా ఆలోచించలేదని, దీంతో చిన్నారికి పేరు పెట్టడంపై కూడా కష్టంగా తోచిందన్నారు. చివరకు ఆడ్రీ అని పేరు పెట్టినట్లు చెప్పారు.