Bandi sanjay:మహిళా కమిషన్ విచారణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. ఇటీవల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో 18వ తేదీన హాజరవుతానని చెప్పి.. ఈ రోజు విచారణకు హాజరయ్యారు.
ఏపీ(ap)లోని ఎన్టీఆర్ జిల్లా(ntr district)లో విషాదం చోటుచేసుకుంది. ఇబ్రహింపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో(Vijayawada Thermal Power Station) లిఫ్ట్ వైరు తెగిన(lift wire breaking) ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ఏపీ(AP)లో అధికార వైఎస్సార్సీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ(TDP) అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు శుక్రవారం రెండో ప్రాధాన్యత లెక్కింపులో 94,510 ఓట్లతో విజయం సాధించారు. మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలిచిన టీడీపీ అభ్యర్థి.. కంచర్ల శ్రీకాంత్ కూడా వైసీపీ మీద ఘన విజయం సాధించారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan) విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పోర్ట్స్ బయోపిక్(Biopic)లో పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తెలిసిన విరాట్, చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan : స్వప్న లోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాద ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు నగరవాసులను ఆందోళన కు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలు అగ్నిప్రమాద ఘటనల్లో పలువురు మృతి చెందగా..తాజాగా సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటన లో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్(ram charan) చరణ్ పలు అవార్డుల కార్యక్రమాల తర్వాత శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు(reached hyderabad). ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్ పోర్టు(begumpet airport)లో చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెలకమ్ చెప్పారు. పూలు పెద్ద ఎత్తున జల్లుతూ సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు.
మద్యం వినియోగం తగ్గించడానికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(ap government) మద్యం ధరలను(liquor prices) పెంచినట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి(minister buggana rajendra prasad) తెలిపారు. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఆల్కహాల్ వినియోగం 38 శాతం తగ్గినట్లు వెల్లడించారు. మరోవైపు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల కంటే ఏపీలో ఆర్థిక లోటు మెరుగ్గా ఉందని బుగ్గన స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో(telangana, ap) మరో రెండు రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే(rain fore cast) అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత రెండురోజులుగా తెలంగాణ, ఏపీలో అనేక చోట్ల వర్షం కురిసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah)ను ఢిల్లీ(delhi)లో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), రామ్ చరణ్(ram charan) శుక్రవారం రాత్రి కలిశారు. ఆ క్రమంలో అమిత్ షా చెర్రీకి శాలువా కప్పి సత్కరించారు. RRR చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా కేంద్రమంత్రి అభినందించారు. అంతేకాదు ఇద్దరు లెజెండ్ హీరోలను కలుసుకున్నందుకు సంతోషంగా ఉందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఏపీ(AP)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఈ దారుణ ఘటనలో ఆరుగురు దుర్మరణం(6 Died) చెందారు. శుక్రవారం సాయంత్రం బొలెరో, ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు విడిచారు. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది.
ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్(ODI Match)లో టీమిండియా(Team India) ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. బరిలోకి దిగిన ఆసీస్(Ausis) బ్యాటర్లు 188 పరుగులకు ఆలౌట్(All Out) అయ్యారు. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 191 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rain) ముంచెత్తుతున్నాయి. గురువారం నుంచి అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఏపీలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. శనివారం కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) బంగ్లాను నూతన మంత్రి అతిషికి (Atishi) కేటాయించారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఈ నెల 14వ తేదీన అతిషికి లేఖ రాసింది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్(Ausis) టీమిండియా(Team India) బౌలర్ల ధాటికి 35.4 ఓవర్లలోనే 188 పరుగులు చేసి కుప్పకూలింది. ఆసీస్ ఆలౌట్ అయ్యింది. టీమిండియా(Team India) పేసర్లు అయిన షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్ జడేజా(Jadeja) రెండు వికెట్లను పడగొట్టాడు.
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా మార్చి 8వ తేదికి 132 కేసులు నమోదయ్యాయి. మార్చి 15వ తేది వరకూ 267 మందికి కరోనా పాజిటివ్(Corona Positive) అని తేలింది. రెండో వారంలో పాజిటివిటీ రేటు 0.31 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు పలు చర్యలు తీసుకోవాలని కేంద్రం తెలంగాణ ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.