Sudeep కోసం ఎందుకు పార్టీల పోటీ..? కాంగ్రెస్, జేడీఎస్ విశ్వ ప్రయత్నాలు..కానీ..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్టార్ హీరో సుదీప్‌పై ఫోకస్ చేశాయి. తమ పార్టీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేశాయి. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు సుదీప్ క్యాంపెయిన్ చేయాలని కోరాయి.
Sudeep:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు స్టార్ హీరో సుదీప్‌పై (Sudeep) ఫోకస్ చేశాయి. తమ పార్టీ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేశాయి. జేడీఎస్ (jds), కాంగ్రెస్ (congress) పార్టీలు సుదీప్‌ను (Sudeep) క్యాంపెయిన్ చేయాలని కోరాయి. చివరకు ఆయన బీజేపీ (bjp) పక్షాన నిలబడ్డారు. దీనిపై కాంగ్రెస్ (congress)- బీజేపీపై (bjp) మాటల యుద్దం జరుగుతోంది. ఇటు మరోవైపు సుదీప్ (Sudeep) నిర్ణయంపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (prakash raj) కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ సుదీప్ (Sudeep) కోసం పార్టీలు ఎందుకు అలా వెంపర్లాడాయి..? ఆయనకు ఉన్న ఫ్యాన్స్ కారణమా? లేదంటే తన సామాజిక వర్గాన్ని ప్రభావం చేస్తారని అనుకున్నాయా?
సుదీప్ (Sudeep) శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. కష్టపడి కన్నడ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. కన్నడతోపాటు (kannada) తమిళ్ (tamil), తెలుగు (telugu) సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సుదీప్ (Sudeep) వాల్మీకి నాయక సామాజిక వర్గానికి చెందినవారు. ఈ తెగ వారు కర్ణాటకలో (karnataka) ప్రాబల్యం ఎక్కువే ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీలో ఎస్టీలు 15, ఎస్సీలకు 36 స్థానాల్లో రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ పెంచాలని గత కొంతకాలంగా డిమాండ్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. వీరి సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతి ప్రసన్నానందపూరి స్వామి 250 రోజులు ఆందోళన చేశారు. ఆయనకు సుదీప్ (Sudeep) సపోర్ట్ చేశారు. దీంతో సీఎం బసవరాజు బొమ్మై (bommai).. ఆందోళన చేస్తున్న స్వామి వద్దకు వచ్చి బుజ్జగించారు. అప్పటికీ ఆందోళన తగ్గకపోవడంతో రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసింది. ఇంత ప్రాధాన్యం ఉన్న సుదీప్ (Sudeep) తమ వెంట ఉంటే ఓటు బ్యాంకు వస్తోందని పార్టీలు భావించాయి.
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ను (dk shivakumar) సుదీప్ (Sudeep) ఫిబ్రవరిలో కలిశారు. అప్పుడే సుదీప్ (Sudeep) రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరిగింది. సినీ పరిశ్రమ సమస్యలు తెలుసుకునేందుకు సుదీప్ (Sudeep) కలిశారని కాంగ్రెస్ పార్టీ (congress) పేర్కొంది. తమకు మద్దతు ఇవ్వాలని సుదీప్‌ను (Sudeep) కోరినట్టు విశ్వసనీయ సమాచారం. 2014 ఎన్నికల్లో కూడా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ఆఫర్ చేసిందనే తెలిసింది. 2018లో జేడీఎస్ కూడా సుదీప్తో (Sudeep) చర్చలు జరిపింది. 2011లో కూడా జేడీఎస్ సుదీప్ (Sudeep) కోసం ట్రై చేసింది. బీజేపీ (bjp) కాక.. కాంగ్రెస్ (congress), జేడీఎస్ (jds) కూడా సుదీప్ (Sudeep) కోసం ప్రయత్నాలు చేశాయి. చివరకు ఆయన బీజేపీ (bjp) వైపు నిలిచారు. అందుకే ప్రచారం చేస్తానని.. పోటీ మాత్రం చేయనని తెిలపారు.
సుదీప్‌కు (Sudeep) కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరుంది. రచయిత (writer), ప్లే బ్యాక్ సింగర్ (playback singer), డైరెక్టర్ (director), ప్రొడ్యూసర్ (producer), టీవీ యాంకర్‌గా కూడా వర్క్ చేశారు. గత 27 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. స్వయంకృషితో ఎదిగారు. స్వచ్చంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టారు. బెంగళూర్ సిటీ పోలీస్, ఇన్ కం టాక్స్ శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తున్నారు. కరోనా సమయంలో కన్నడ సినీ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇతరులకు ఆర్థికంగా సాయం చేశారు.