»Film Star Free To Choose On Campaign Congress Reacts On Kiccha Sudeep Support To Bjp
Sudeep ప్రచారం: కర్ణాటక భవితవ్యాన్ని ప్రజలు నిర్ణయిస్తారు.. సినీ తారలు కాదు: కాంగ్రెస్
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైని కలిసి ప్రచారం చేస్తానని సినీ హీరో సుదీప్ ప్రకటించగా కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుదీప్ స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు అని రియాక్ట్ అయ్యింది.
Film star free to choose on campaign Congress reacts on Kiccha Sudeep support to bjp
Film star free to choose on campaign:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ దూసుకెళ్తున్నాయి. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైని (bommai) కలిసి ప్రచారం చేస్తానని సినీ హీరో సుదీప్ (sudeep) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీకి ప్రచారం విషయంలో సుదీప్ (sudeep) స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చు అని రియాక్ట్ అయ్యింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా సుదీప్ (sudeep) చేత ప్రచారం చేయించాలని అనుకున్న సంగతి తెలిసిందే.
కర్ణాటక భవితవ్యాన్ని రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా (surjewala) తెలిపారు. అంతే తప్ప సినీ తారలు ఎంతమాత్రం కాదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సినీ నటుడు ఎవరికీ మద్దతు ఇవ్వాలో దర్యాప్తు సంస్థలు నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. సీఎం బసవరాజు బొమ్మై (bommai) మాట ఎవరూ వినడం లేదని పేర్కొన్నారు. అందుకోసమే ఇప్పుడు సినీతారలపై ఆధారపడ్డారని పేర్కొన్నారు.
సుర్జేవాలా (surjewala) ట్వీట్ చేయగా.. బీజేపీ కూడా స్పందించింది. ట్రైబల్ సామాజిక వర్గానికి చెందిన ఓ సినీ నటుడు బీజేపీకి సపోర్ట్ చేయడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది అని మండిపడింది. ఈ రోజు ఉదయం సుదీప్‌కు వచ్చిన బెదిరింపు లేఖతో మీకు ఏమైనా సంబంధం ఉందా అని అడిగారు.
అంతకుముందు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైను కన్నడ నటుడు కిచ్చ సుదీప్ (sudeep) కలిశారు. బీజేపీకి (bjp) మద్దతు ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. కానీ ప్రచారం మాత్రం చేస్తానని స్పష్టంచేశారు. సీఎం బొమ్మై (bommai) అంటే తనకు గౌరవం ఉందని చెప్పారు. అందుకోసమే బీజేపీ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఇదివరకు చాలాసార్లు బసవరాజు బొమ్మై (bommai) తనకు సాయం చేశారని గుర్తుచేశారు. దానికి ప్రతీగా ఈ సారి బీజేపీ (bjp) తరఫున క్యాంపెయిన్ చేస్తానని ప్రకటించారు.
A Film Star is free to choose whom to support, sometimes by IT-ED or otherwise.