CM Bommaiకి నేనున్నా.. బీజేపీ తరఫున ప్రచారం చేస్తా: సినీ నటుడు సుదీప్
కన్నడ నటుడు కిచ్చ సుదీప్ కర్ణాటక బీజేపీకి మద్దతు ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. ప్రచారం మాత్రం చేస్తానని స్పష్టంచేశారు. ఈ రోజు సీఎం బొమ్మైని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
campaign for BJP, won't contest says Kiccha Sudeep
karnataka assembly elections 2023:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం స్పీడందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలను రంగంలోకి దింపుతున్నారు. కన్నడ నటుడు కిచ్చ సుదీప్ (sudeep).. బీజేపీకి (bjp) తన మద్దతు ప్రకటించారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని.. ప్రచారం మాత్రం చేస్తానని స్పష్టంచేశారు. ఈ రోజు సీఎం బొమ్మైని (bommai) కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
సీఎం బసవరాజు బొమ్మై (bommai) అంటే తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. అందుకోసమే బీజేపీ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నానని వివరించారు. ఇదివరకు చాలాసార్లు బసవరాజు బొమ్మై (bommai) తనకు సాయం చేశారని గుర్తుచేశారు. దానికి ప్రతీగా ఈ సారి బీజేపీ (bjp) తరఫున క్యాంపెయిన్ చేస్తానని ప్రకటించారు.
బీజేపీకి (bjp) ప్రచారం చేసి బొమ్మైకి (bommai) తన రుణం తీర్చుకుంటానని సుదీప్ (sudeep) పేర్కొన్నారు. తన జీవితంలో ఎదిగే సమయంలో చాలా మంది సాయం చేశారని.. అందులో బొమ్మై (bommai) ముందు వరసలో ఉంటారని చెప్పారు. ఈ రోజు బొమ్మై (bommai) కోసం తాను ఇక్కడికి వచ్చానని.. పార్టీ కోసం కాదన్నారు. బీజేపీ తరఫున తాను ప్రచారం చేస్తానని.. పోటీకి మాత్రం దూరంగా ఉంటానని చెప్పారు. ఇదే విషయం బసవరాజు బొమ్మైకి (bommai) చెప్పానని వివరించారు.
సుదీప్ (sudeep) బీజేపీలో (bjp) చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఈ రోజు సీఎం బసవరాజు బొమ్మైని (bommai) కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో చేరే విషయంపై మాత్రం సుదీప్ (sudeep) స్పందించలేదు. బొమ్మై (bommai) కోసం బీజేపీ (bjp) తరఫున మాత్రం ప్రచారం చేస్తానని వివరించారు. దీంతో పార్టీలో చేరేది లేదని స్పష్టమైంది.