సంగారెడ్డి: సిర్గాపూర్ మండలంలోని పొట్పల్లి గ్రామపంచాయతీ ఎస్సీ మహిళ రిజర్వు స్థానానికి BRS మద్దతుదారు సుజాత-రాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి మంజుల కులకర్ణికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతంలో ఉన్న తమ గ్రామ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.