ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మిషన్: చాప్టర్ 1(Mission Chapter 1) మూవీ నుంచి టీజర్ విడుదలైంది. టీజర్లో అద్బుతమైన సన్నివేశాలతోపాటు ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ కూడా బోలేడు ఉన్నాయి. దీంతోపాటు ఓ ఖైదీగా హీరో అరుణ్ విజయ్ యాక్టింగ్, జి.వి.ప్రకాష్ కుమార్ బీజీఎం సహా ఉత్కంఠ రేపు సన్నివేశాలు ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ, వరుస విజయాలను అందుకుంటూ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు లైకా ప్రొడక్షన్స్(lyca productions) అధినేత సుభాస్కరన్. ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించటంతో పాటు వైవిధ్యమైన, ఎవరూ రూపొందించని, ప్రేక్షకులను కట్టిపడేసే కథాంశాలున్న సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ పరంగానూ అండగా నిలుస్తోంది. ఆడియెన్స్‌ను అలరించే సినిమాలను సరైన సమయంలో అందించటంలో ఎప్పుడూ ముందుంటోంది. అందుకనే సినీ ప్రేమికులకు లైకా ప్రొడక్షన్స్ గురించిన పరిచయం అక్కర్లేదు.
ఇప్పుడలాంటి లిస్టులోకి చేరిన మరో భారీ బడ్జెట్ చిత్రం ‘మిషన్: చాప్టర్ 1(Mission Chapter 1)’. ‘ఫియర్లెస్ జర్నీ’ ట్యాగ్ లైన్. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను విజయ్ దర్శకత్వంలో ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మించారు. బుధవారం (ఏప్రిల్ 5)రోజున ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
టీజర్లో చాప్టర్ 1(Mission Chapter 1)ను గమనిస్తే ఇది లండన్‌లో పేరు మోసిన జైలు బ్యాక్ డ్రాప్లో మూవీ నడుస్తుందని అర్థమవుతుంది. ప్రపంచంలోని ఖైదీలందరూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలుకు సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఎమీ జాక్సన్ నటిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీ పాత్రలో హీరో అరుణ్ విజయ్(arun vijay) నటించారు. కుటుంబంతో ఇండియా నుంచి లండన్ వచ్చిన అరుణ్ విజయ్‌ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన కుమార్తెకు మరో రెండు రోజుల్లో ఆపరేషన్ ఉంటుంది. తనేమో జైలులో ఉంటాడు. తన కూతురేమో తండ్రి కోసం ఎదురు చూస్తుంటుంది. అసలేం జరిగింది..హీరో అరుణ్ విజయ్ ఏ కారణాలతో తను వాండ్స్‌వర్త్ జైలుకి వెళ్లాడు. చివరకు వాండ్స్ వర్త్ జైలు సూపరిడెంట్ ఆఫీసర్ అయిన ఎమీ జాక్సన్ ఏమైనా హెల్ప్ చేసిందా? అనే వివరాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
డైరెక్టర్ విజయ్(arun vijay) తనదైన ప్లానింగ్‌తో ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని 70 రోజుల్లోనే పూర్తి చేశారు. అలాగే ఈ మూవీ కోసం లండన్ వాండ్స్ వర్త్ జైలు చెన్నైలో పునః సృష్టించటం విశేషం. హీరో అరుణ్ విజయ్ రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా ఆ సన్నివేశాల్లో నటించారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. టీజర్లో ఆ విషయం స్పష్టమైంది. అలాగే నైట్ షాట్స్, డ్రామా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.