కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా యాక్ట్ చేస్తున్న చిత్రం మిషన్: చాప్టర్ 1. దీనిని తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రొమోలో నటీనటుల పనితీరును గమనించవచ్చు.
భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions) అధినేత సుభాస్కరన్. సినిమాలను నిర్మించటంతో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ తనదైన పంథాలో ఈ సంస్థ రాణిస్తోంది. ఎవరూ టచ్ చేయని అంశాలతో వైవిధ్యమైన కథాంశాలున్న సినిమాలను ప్రేక్షకులకు అందిస్తోంది లైకా ప్రొడక్షన్స్. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్(arun vijay) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ‘మిషన్: చాప్టర్ 1’(Mission Chapter 1). తాజాగా లైకా ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్నక్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో ఇది కూడా చేరింది. ఈ చిత్రానికి ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో దిగ్గజ చిత్రాలుగా అందరి ఆదరాభిమానాలను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్రస్తుతం నిర్మిస్తోంది. తాజాగా ‘మిషన్: చాప్టర్ 1’(Mission Chapter 1) సినిమాను విశ్లేషించి ఒక పరిమితమైన హద్దులు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని లైకా టీమ్ భావించింది. దీంతో లైకా సంస్థ ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రాన్ని నాలుగు భాషల్లో(తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడ) భారీ ఎత్తున విడుదల చేయటానికి సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, ఆడియో, థియేట్రికల్ రిలీజ్‌కి సంబంధించిన వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
మరోవైపు విలక్షణమైన సినిమాలను తెరకెక్కించే ప్రతిభ ఉన్న దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన చిత్ర నిర్మాణంలోని పలు విభాగాలతో పాటు ప్రజల అభిరుచులను ఆధారంగా చేసుకుని సినిమాలను రూపొందిస్తుంటారు. ‘మిషన్:చాప్టర్ 1’(Mission Chapter 1) చిత్రాన్ని కేవలం 70 రోజుల్లోనే లండన్, చెన్నై సహా పలు లొకేషన్స్‌లో శరవేగంగా చిత్రీకరించటం గొప్ప విశేషమని చెప్పవచ్చు.
అద్భుతమైన టెక్నికల్ అంశాలతో రూపొందిన ‘మిషన్: చాప్టర్ 1’ చిత్రం హీరో అరుణ్ విజయ్ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతుందని అనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత.. రోబో 2.0లో నటించి, అలరించిన ముద్దుగుమ్మ ఎమీ జాక్సన్(amy jackson) ఈ చిత్రంతో మళ్లీ సినిమాల్లో అడుగు పెడుతున్నారు. జైలును సంరక్షించే ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటి నిమిషా సజయన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రను పోషించారు. జి.వి.ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ సినిమా కోసం లండన్ జైలును పోలి ఉండేలా చెన్నై(chennai)లో భారీ ఖర్చుతో ఓ జైలు సెట్ కూడా వేశారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన యాక్షన్ సన్నివేశాలు సినిమాను చూసే ప్రేక్షకులకు ఆహా అనిపిస్తాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో చిత్రీకరించిన నైట్ షాట్స్, డ్రామా ప్రేక్షకులను మరింత ఉత్కంఠతకు లోను చేస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో ఎంత కష్టమున్నప్పటికీ హీరో అరుణ్ విజయ్ వెనకడుగు వేయలేదు. ఆయనే స్వయంగా ఆ సన్నివేశాల్లో నటించారు. దీంతో యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్‌గా వచ్చాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.