భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు (bjp telangana president), కరీంనగర్ ఎంపీ (karimnagar mp) బండి సంజయ్ కి (bandi sanjay) బెయిల్ వచ్చింది. పదో తరగతి హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో ఆయనను కక్షపూరితంగా ప్రధాన నిందితుడిగా చేశాడనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ వాదనల (bandi sanjay bail) సమయంలో కోర్టు పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు వాదనలు జరిగాయి. ఆ తర్వాత గురువారం మొత్తం ఉత్కంఠ పరిస్థితులు నెలకొనగా, రాత్రి పది గంటలకు బెయిల్ మంజూరు అయింది (Telangana BJP chief Bandi Sanjay gets bail). రూ.20వేల సొంత పూచీకత్తుతో పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో బండి సంజయ్, బీజేపీ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లకు సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అలాగే కేసుకు సంబంధించి పోలీసులకు సహరించాలని, సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించవద్దని ఆదేశించింది. హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ రాపోలు అనిత సుదీర్ఘ విచారణ చేపట్టారు. రాత్రి బెయిల్ వచ్చింది. నిబంధనల ప్రకారం సాయంత్రం గం.5.30 లోపు ఉత్తర్వులు అందితే రాత్రి లోపు జైలు నుండి విడుదల చేస్తారు. కోర్టు ఉత్తర్వులు రాత్రి రావడంతో శుక్రవారం విడుదల చేస్తారు.
ప్రశ్నాపత్రం లీకేజీ (ssc paper leak) కేసులో రిమాండ్ కు పంపుతూ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని బండి సంజయ్, ఆయనను అక్రమంగా నిర్బంధించారని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సురెందర్ రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ అయ్యాయి. అరెస్ట్ సమయంలో పోలీసులు సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ పాటించలేదని, అలాగే మానసికంగా, భౌతికంగా వేధించారని లాయర్ వాదనలు వినిపించారు. మరోవైపు పిటిషనర్ పైన ఉన్న ఆరోపణ ఏమిటని చీఫ్ జస్టిస్ అడగ్గా… ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర చేశారన్నారు. చీప్ జస్టిస్ జోక్యం చేసుకొని.. నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని సర్క్యులేట్ చేయడం తప్ప రికార్డుల్లో ఏమీ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. తనకు అందిన సమాచారం ద్వారా పిటిషనర్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. అనంతరం హైకోర్టు కేసును 10వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు హెబియస్ కార్పస్ పిటిషన్ విషయమై సంజయ్ ని నిర్బంధించడంపై హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ పోలీసు కమిషనర్లు, కరీంనగర్, బొమ్మలరామారం ఎస్హెచ్ఓలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.