»Dk Shivakumar Says Congress Will Win 141 Seats In Karnataka
DK Shivakumar:కాంగ్రెస్ గెలుపు పక్కా.. ఎన్ని సీట్లు అంటే..?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ విజయంపై విశ్వాసంతో ఉన్నారు. 141 సీట్లు గెలుచుకుని అధికారం చేపడుతామని పేర్కొన్నారు.
DK Shivakumar says Congress will win 141 seats in Karnataka
DK Shivakumar:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. నేతలు అందరూ కలిసికట్టుగా ప్రచారం చేస్తున్నారు. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar).. మాజీ సీఎం సిద్దరామయ్య కలిసి క్యాంపెయిన్ చేస్తున్నారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ (DK Shivakumar) మాట్లాడారు.
కర్ణాటక అసెంబ్లీలో 141 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని డీకే శివకుమార్ (DK Shivakumar) తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు గెలవాల్సి ఉంటుంది. డీకే లెక్కల ప్రకారం 141 సీట్లతో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదు.
తమ పార్టీకే స్పష్టమైన ఆధిక్యం వస్తోందని విశ్వాసంతో ఉన్నారు. జేడీఎస్ (jds) కూడా కొన్ని సీట్లు గెలుచుకొని.. హంగ్ ఏర్పడే పరిస్థితి లేనే లేదన్నారు. మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. రెండో విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 166 సీట్లతో సెకండ్ లిస్ట్ విడుదల అయ్యింది. పార్టీ ప్రకటిస్తోన్న అభ్యర్థులకు సంబంధించి అంతా ఐకమత్యంతో ఉన్నారని.. ఎక్కడ లుకలుకలు లేవని చెప్పారు.
పార్టీలో గ్రూపు రాజకీయాలు.. సిద్దరామయ్య, డీకే కొందరు అభ్యర్థులను బరిలోకి దింపారనే ప్రశ్న వేయగా.. కొట్టిపారేశారు. ఒకవేళ నిలిపినా.. అదీ తమ పార్టీకే మేలు జరుగుతుందన్నారు. సీఎం రేసులో తానే ఉన్నానని సిద్దరామయ్య కామెంట్ చేసి నాలిక కరుచుకున్న సంగతి తెలిసిందే. ఇటు డీకే శివకుమార్ యాత్ర ద్వారా జనాలతో మమేకం అవుతున్నారు. ఇదే అంశంపై ప్రశ్నించగా.. హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అవకాశం వస్తే స్వాగతిస్తానని పేర్కొన్నారు.