జూ.ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ రోల్ ఉందని.. ఆ పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.