AK Antony:కాంగ్రెస్ ముఖ్య నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని (AK Antony) కుమారుడు.. అనిల్ ఆంటోని (anil antony) ఈ రోజు బీజేపీలో చేరారు. ఈ అంశంపై ఏకే ఆంటోని (AK Antony) మీడియాతో మాట్లాడారు. తనకు చాలా బాధగా ఉందన్నారు. అనిల్ (anil) నిర్ణయం తనను షాక్‌నకు గురిచేసిందని తెలిపారు. ఇది తప్పుడు నిర్ణయమే అని చెప్పారు. బీజేపీలో చేరాడని తెలిసి చాలా బాధపడ్డానని వివరించారు. తాను ఎప్పుడూ బీజేపీ (bjp), ఆరెస్సెస్ (rss) విధానాలకు మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ నినాదం దేశాన్ని విభజించి.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం అని ఆంటోని (antony) విమర్శించారు. తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ- నెహ్రూ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటానని చెప్పారు. దేశం ఎప్పుడూ ఐకమత్యంగానే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీని చూసి తాను స్పూర్తి పొందానని ఏకే ఆంటోని తెలిపారు. ఆమె తనను రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎంకరేజ్ చేశారని పేర్కొన్నారు. పాలసీ విషయంలో ఒకసారి వ్యతిరేకించానని.. తర్వాత పార్టీలోకి వచ్చి.. ఇందిర అంటే గౌరవంతో పనిచేశానని వివరించారు.
తన రాజకీయ జీవితం చివరి దశకు చేరిందని ఆంటోని వివరించారు. తాను ఎప్పటికీ వరకు బతికి ఉంటానో తెలియదన్నారు. జీవించి ఉన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఆ తర్వాత తన కుమారుడి గురించి ఎప్పుడూ మాట్లాడబోనని తేల్చిచెప్పారు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించొద్దు అని మీడియాను కోరారు.
అనిల్ ఆంటోని (Anil Antony) కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కేరళ బీజేపీ చీఫ్ వీ మురళీధరన్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనిల్ ఆంటోనికి సురేంద్రన్ పుష్పగుచ్చం అందజేసి పార్టీలోకి స్వాగతం పలికారు. ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని ఇండియాలో (india) ప్రమోట్ చేయడాన్ని గతంలో అనిల్ తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో తమకు బీజేపీతో (bjp) విభేదాలు ఉన్నప్పటికీ.. భారతదేశంపై బీబీసీ వ్యక్తం చేసిన అభిప్రాయం సరిగా లేదన్నారు. ట్వీట్ చేసిన సమయంలో అనిల్ కేరళ కాంగ్రెస్ డిజిటల్ మీడియా ఇంచార్జీగా (kerala congress digital media incharge) ఉన్నారు. సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. ట్వీట్ వెనక్కి తీసుకోవాలని కోరినా.. వినలేదు. ఈ రోజు బీజేపీలో చేరారు.