జార్జియా దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుడౌరి పర్వత రిసార్ట్‌లో ఒకే సారి 12 మంది మృతి చెందారు. వీరిలో 11 మంది భారత్‌కు చెందినవారు ఉన్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
TG: గ్రూప్-2 పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది. నాలుగో పేపర్ రాస్తుండగా.. నగేశ్ అనే అభ్యర్థికి గుండెపోటు రావడంతో నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరీక్ష కేంద్రం వద్ద విధుల్లో ఉన్న ఎస్సై వాహనంలో ఎక్కించుకుని ఆస్పత్రిలో చేర్చారు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. అయితే, అతడికి మూర్చ వ్యాధి ఉందని, గుండెపోటు కాకపోవచ్చని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి...
HYD: బొటానికల్ గార్డెన్ వద్ద ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా ప్రధాన రోడ్డులో ఓపెన్ మ్యాన్ హోల్ ప్రమాదకరంగా మారింది. మ్యాన్ హోల్ మూతలు సరిగా లేకపోవడంతో బైకులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సిబ్బంది నిర్లక్ష్యంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టాలని, ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
JGL: వెల్గటూర్ మండలంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థంబంపల్లి గ్రామ శివారులో గొర్రెలను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5 గొర్రెలు మృతి చెందగా పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమయ్యింది. వాహనదారుడు ప్రమాదం నుండి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NZB: పొలం డబ్బుల విషయంలో జరిగిన గొడవలో ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు మోపాల్ ఎస్సై యాదగిరి గౌడ్ ఆదివారం తెలిపారు. న్యాల్కల్ గ్రామానికి చెందిన పోసాని రెండు రోజుల క్రితం పొలం డబ్బుల విషయంలో భర్తతో పోసాని గొడవ పెట్టుకొన, ఇంటి నుంచి వెళ్లిపోయింది. నిన్న చెరువులో మృతదేహం తేలగా జాలర్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
కామారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దోమకొండ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. భోగిని రాకేష్(26) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రాకపోవడంతో మనస్తాపంతో మృతి ఆత్మహత్య చేసుకున్నాడు.
PLD: మాచర్ల మండలం కంభంపాడు గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెంటచింతల నుంచి మాచర్ల వస్తున్న ఆటో గేదెను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రెంటచింతలకు చెందిన కత్తి సుబ్బయ్య(50) మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ వైద్య శాలలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు రిఫర్ చేశారు.
NGKL: అచ్చంపేట పట్టణ సమీపంలోని పలకపల్లి రోడ్డులో మధునాగుల చంద్రయ్య వ్యవసాయ పొలంలో నిల్వ ఉంచిన వరిగడ్డి వాము సోమవారం అగ్ని ప్రమాదంతో పూర్తిగా దగ్ధమైంది. అచ్చంపేట ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. పశువుల కోసం నిల్వ ఉంచుకున్న దాదాపు 50 వేల విలువ చేసే వరిగడ్డి దగ్ధం అయ్యిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజస్థాన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగి.. పొగ వ్యాపించడంతో 12 మంది విద్యార్థులు స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆ సెంటర్లో 350 విద్యార్...
ATP: పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపంలోని మంగాపురం వద్ద సోమవారం గూడ్స్ రైలు కింద పడి ఇద్దరు యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు మృతులు ఒరిస్సాకు చెందిన యువతులుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హర్యానాలోని గురుగ్రామ్‌లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. రెస్టారెంట్లో ఘర్షణ చెలరేగడంతో అల్లరిమూకలు కారును తగలబెట్టారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అల్లరిమూకలను చెదరగొట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: ఏలూరులో రైలు ఢీకొనడంతో ఏపీఎస్పీ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైల్వే ఎస్సై సైమన్ వివరాలు వెల్లడించారు. గొల్లయిగుడెంకు చెందిన మధుబాబు (41) కాకినాడలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సెలవులకు ఇంటికి వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో మృతి చెందాడన్నారు.
నంద్యాల: కుటుంబ కలహాలతో అరుణకుమారి అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బనగానపల్లె మండలం జిల్లెల్ల గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
TPT: శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలోని సీతారాంపేట ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి లారీ బోల్తా పడిన ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జయచంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడిని 108 వాహనం ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
WNP: ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నితీష్ కుమార్(18) ఆదివారం రాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. నితీశ్ గత కొంతకాలంగా బెంగళూరులో గ్లాస్ వర్క్ చేసేవాడు. అయితే మూడు నెలల నుంచి ఇంటి వద్దనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.