• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

పాము కాటుతో యువకుడు మృతి

WNP: పాము కాటుతో యువకుడు మృతి చెందిన విషాద ఘటన పెబ్బేరు పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన గంధం రవి(19) సోమవారం రాత్రి తన వరి పొలానికి నీళ్లు పెట్టి వస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు.

November 4, 2025 / 02:48 PM IST

రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు..!

NGKL: జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని రవి థియేటర్ ఎదుట మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

November 4, 2025 / 02:40 PM IST

భారీ పేలుడు.. 23 మంది మృతి

మెక్సికోలోని ఓ సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 23 మంది మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

November 2, 2025 / 09:42 AM IST

వాహనం బీభత్సం.. ఇద్దరు మృతి

TG: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లో ఓ వాహనం బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ చెరువు కట్టపై అతివేగంగా వచ్చిన థార్ వాహనం పలువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడితో పాటు ఓ యువతి మృతిచెందింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. చెరువులో పడి యువతి చనిపోయింది.

November 2, 2025 / 09:37 AM IST

BREAKING: దారుణం.. నలుగురిని చంపి వ్యక్తి ఆత్మహత్య

TG: వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. భార్య, కొడుకు, కూతురు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి దారుణంగా నరికి చంపాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ దారుణ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

November 2, 2025 / 06:16 AM IST

ట్రాక్టర్, ఆటో ఢీ.. పలువురికి గాయాలు

VKB: ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటన తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్గనూర్ గ్రామ సమీపంలో ఓ ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టడంతో పలువురి ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

November 1, 2025 / 09:02 PM IST

ఆటో బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

ATP: గుంతకల్లు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో శనివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్దపుల్లన్న అనే వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

November 1, 2025 / 07:42 PM IST

గాల్లోకి కాల్పులు.. తండ్రీకొడుకులు అరెస్ట్‌

దీపావళి రోజు తండ్రీకొడుకులు టపాసులకు బదులు తుపాకీలను కాల్చటం తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీలోని శాస్త్రీనగర్‌కు చెందిన ముకేశ్, అతని తండ్రి పండుగ రోజున తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ కావడంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు.

November 1, 2025 / 06:42 PM IST

ప్రభుత్వ ఉపాధ్యాయుడు గల్లంతు

NRML: కడెం ప్రాజెక్టులో పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కుంట్ల రాజశేఖర్ రెడ్డి గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు. కరీంనగర్ జిల్లా జూలపల్లి సాయికాబి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి శనివారం ఖానాపూర్‌లో వివాహానికి వెళ్లే సందర్భంలో మార్గమధ్యలో కడెం ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగి క్రమంలో ప్రాజెక్టులో పడి గల్లంతాయాడని వారు తెలిపారు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

November 1, 2025 / 04:50 PM IST

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం

ATP: గుత్తి మండలం చెరువు తండాకు చెందిన లక్ష్మీబాయి అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా శనివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

November 1, 2025 / 04:18 PM IST

విషాదం.. స్నానానికి వెళ్లి నలుగురు యువతులు మృతి

తమిళనాడులోని ఎన్నూరు బీచ్ వద్ద సముద్ర స్నానం కోసం వెళ్లిన నలుగురు యువతులు అలల తాకిడికి కొట్టుకుపోయి మృతి చెందారు. మృతులను దేవకి సెల్వమ్(30), భవాని(19), షాలిని(17), మరియు గాయత్రి(18)గా గుర్తించారు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మృతుల్లో ఒకరైన దేవకి, శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.

November 1, 2025 / 01:00 PM IST

ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్ పట్టివేత

ముంబై విమానాశ్రయంలో భారీగా కొకైన్‌‌ను అధికారులు పట్టుకున్నారు. కొలంబో నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణీకురాలి నుంచి కాఫీ ప్యాకెట్లలో దాచిన తొమ్మిది పౌచ్‌లలో దాదాపు రూ.47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కొకైన్‌ను తీసుకోవడానికి వచ్చిన వ్యక్తితో పాటు మొత్తం ఐదుగురిని DRI అధికారులు అరెస్టు చేశారు.

November 1, 2025 / 12:23 PM IST

BREAKING: ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి

AP: శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

November 1, 2025 / 12:04 PM IST

బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

CTR: బంగారుపాళెం (M) తంబుగానిపల్లి వద్ద శుక్రవారం రాత్రి బైకు అదుపుతప్పడంతో తుంబకుప్పానికి చెందిన ఉమాశంకర్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి అనంతరం CMC హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

November 1, 2025 / 11:46 AM IST

51 ఏళ్ల GHMC కార్మికురాలిపై అత్యాచారం

TG: హైదరాబాద్ ఎర్రగడ్డలో దారుణం చోటుచేసుకుంది. రాజు అనే వ్యక్తి 51 ఏళ్ల జీహెచ్ఎంసీ కార్మికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ESI ఆస్పత్రి సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన జరగ్గా.. బోరబండ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

November 1, 2025 / 10:38 AM IST