కోనసీమ: ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రావులపాలెం నుంచి రాజమహేంద్రవరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.హైవే సేఫ్టీ సిబ్బంది సహాయంతో క్షతగాత్రుడిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.