ASR: డుంబ్రిగూడ మండలంలోని కుసుమావలస గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ఆటో రోడ్డు ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కించుమండల వైపు నుంచి అరకు వారపు సంతకు కూరగాయలు తీసుకువెళుతున్న ఓ ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించాయని పేర్కొన్నారు.