• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

సత్తెనపల్లిలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

PLD: సత్తెనపల్లిలోని గడియార స్తంభం వద్ద సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సాయి శరణ్య జనరల్ స్టోర్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి షాపు పూర్తిగా దగ్ధమైంది. ఇందులో రూ.40లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

December 17, 2024 / 09:40 AM IST

లావనూరులో మృతదేహం కలకలం

కడప: కొండాపురం మండలం లావనూరు గ్రామం వద్ద ఓ మృతదేహం మంగళవారం కలకలం రేపింది. లావనూరు నుంచి యల్లనూరు గ్రామం వెళ్లేదారిలో అటుగా వెళుతున్న ప్రజలు మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు కొండాపురం పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎస్సై విద్యాసాగర్ అక్కడికి చేరుకొని విచారిస్తున్నారు.

December 17, 2024 / 09:36 AM IST

7.3తీవ్రతతో భారీ భూకంపం

పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.3గా నమోదైంది. దీంతో అధికారులు సునామి హెచ్చరికలు జారీ చేశారు. విపత్తు తాలుకూ నష్టంపై స్పష్టత రాలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

December 17, 2024 / 09:07 AM IST

నారాయణ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య

HYD: నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు మరవకముందే తాజాగా ఆ సంస్థ రెసిడెన్షియల్ స్కూల్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్ బ్రాంచ్‌లో ఏడో తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. అయితే తమ కుమారుడి మృతిపై యాజమాన్యం పొంతన లేని సమాధానం చెబుతోందంటూ బంధువులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు.

December 17, 2024 / 09:01 AM IST

వృద్ధురాలి దారుణ హత్య

TPT: రూరల్ మండలంలో ఓ వృద్ధురాలు దారుణ హత్యకు గురయ్యారు. తిరుపతి రూరల్ మండలం పాడిపేటలోని బజారువీధిలో జీవరత్నమ్మ తన కుమార్తె లలితతో కలిసి నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి విధులకు వెళ్లిన ఆమె సాయంత్రం తిరిగివచ్చారు. అప్పటికే ఇంట్లో మంచంపై విగతజీవిగా పడిఉన్న తల్లిని చూసి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

December 17, 2024 / 08:53 AM IST

ఇద్దరు పిల్లలతో సహా తల్లి మిస్సింగ్

కృష్ణా: తన భార్య, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని పెనమలూరు తాడిగడపకు చెందిన పెయింటర్ రాజేశ్ పోలీసులను ఆశ్రయించారు. భర్త కథనం.. భార్య జ్యోత్స్న విజయవాడలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోంది. ఈనెల 5న భార్య పిల్లలను తీసుకుని వెళ్లిపోయింది. తెలిసిన చోట్ల అంతా వెతికి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేశామన్నారు.

December 17, 2024 / 08:23 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి పరిస్థితి విషమం

అన్నమయ్య: బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు పరిస్థితి విషమించినట్లు తాలూకా ఎస్సై హరిహర ప్రసాద్ తెలిపారు. మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లి పంచాయతీ కాశిరావుపేట సమీపాన ఉన్న కంకర ఫ్యాక్టరీ వద్ద, సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటరిస్టు తీవ్రంగా గాయపడి ఉన్నాడని స్థానికులు గుర్తించారు. స్థానికులు వెంటనే 108లో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

December 17, 2024 / 07:42 AM IST

రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి

KRNL: మద్దికేర మండల పరిధిలోని బురుజుల గ్రామం వద్ద బైక్ అదుపుతప్పి వీఆర్వో శ్రీనివాసులు మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. శ్రీనివాసులు తుగ్గలి మండలం రామ్ కొండ వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య కళావతితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మద్దికేర ఎస్సై విజయ్ కుమార్ నాయక్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

December 17, 2024 / 07:07 AM IST

కళ్యాణదుర్గంలో శతాధిక వృద్ధురాలు మృతి

ATP: కళ్యాణదుర్గం మండలం బాల వెంకటాపురం గ్రామంలో దాసరి లక్ష్మమ్మ(100) అనే శతాధిక వృద్ధురాలు సోమవారం మృతి చెందింది. మృతురాలు దాసరి లక్ష్మమ్మకు ఆరుగురు కుమారులు ఒక కూతురు ఉన్నది. లక్ష్మమ్మ అనారోగ్య సమస్యతో మృతి చెందింది. ఆమె మృతికి స్నేహితులు, బంధువులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. దాదాపు నాలుగు తరాలు చూసినట్లుగా పేర్కొన్నారు.

December 17, 2024 / 06:53 AM IST

మనస్థాపంతో విద్యార్థి ఆత్మహత్య

MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థి మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం బావ తూం రాజు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న నల్ల నవీన్ (14) రెండు రోజులుగా మనస్థాపం చెంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

December 17, 2024 / 05:07 AM IST

కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య

KMR: గాంధారి మండలం రాంపూర్ తండాకు చెందిన పోచయ్య కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న నయం కాలేదన్నారు. దీంతో జీవితంపై విరక్తిచెందిగడ్డి మందు తాగినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు వివరించారు.

December 17, 2024 / 04:31 AM IST

అమెరికాలో కాల్పులు.. ఐదుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. విస్కాన్సిన్ రాజధాని మాడిసన్‌లో దుండగుడు ఓ స్కూల్‌లో కాల్పులు జరిపాడు. ఈ దుశ్చర్యలో ఐదుగురు చనిపోగా మరో ఐదుగురు గాయపడ్డారు. నిందితుడు కాల్పుల్లో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 17, 2024 / 04:25 AM IST

బైక్ అదుపుతప్పి.. ఒకరు మృతి

NZB: బైక్ అదుపుతప్పి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు మోపాల్ ఎస్సై యాదగిరి గౌడ్ సోమవారం తెలిపారు. డిచ్పల్లి మండలం దూస్గాం గ్రామానికి చెందిన ఇందూరు రాములు పని నిమిత్తం నిజామాబాద్‌కు వచ్చి, కంజర నుంచి కులాస్పూర్ మీదుగా ఇంటికి వెళుతుండగా బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో రాములు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

December 17, 2024 / 04:12 AM IST

ఏసీబీ వలకు చిక్కిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్

JGL: మెట్‌పల్లిలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఆఫీసుద్దీన్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నాలుగు మామిడి చెట్లు తరలించడానికి ఎన్వోసీపై సంతకం చేయడానికి రూ. 4,500 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

December 17, 2024 / 04:11 AM IST

వేట్లపాలెంలో 3 హత్యలు.. 8మంది అరెస్ట్

AP: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్ల పాలెంలో ఆదివారం రాత్రి మూడు హత్యలు జరిగాయి. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వెల్లడించారు. ‘మాలచెరువులో బాధితులు ఇల్లు కడుతున్నారని గ్రామకార్యదర్శికి ఫిర్యాదు అందింది. వివాదంపై కుల పెద్దలు పంచాయతీ పెట్టారు. బాధిత కుటుంబం స్లాబు వేయడంతో పరస్పర దాడులకు దారి తీశాయి’ అని పేర్కొన్నారు.

December 17, 2024 / 03:43 AM IST