E.G: గోకవరం మండలం బావాజీపేట గ్రామానికి చెందిన దుల్ల చరణ్ అనే యువకుడు గురువారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ సంఘటనపై గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రికి తరలించినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.