SDPT: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తల్లి ఐదు వేలు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం మీనాజీపేట గ్రామంలో జరిగింది. నాగరాజు అనే యువకుడు మద్యానికి బానిస అయి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లితో గొడవకు దిగిన అనంతరం కోపంతో తను మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.