యూపీ సీఎంగా యోగి ఆరేళ్లు పూర్తి చేసుకోవడం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. భారత్ ఫేవరేట్ ముఖ్యమంత్రి (IndiaKeFavouriteCM), దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి (IndiaBestCM) అంటూ నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
మాత్రలు, ఇంజెక్షన్ లు, కాపర్ టీ, కండోమ్ ( pills, injections, copper-t, condoms) వంటి గర్భ నిరోధక పద్ధతుల స్థానంలో (existing methods of contraception) కొత్త పద్ధతి రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States, Andhra Pradesh, Telangana) దీనిని తొలిసారి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం (central government) యోచిస్తోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA), వైసీపీ రెబెల్ నేత (YCP rebel leader) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) సోదరుడు... గిరిధర్ రెడ్డి (Kotamreddy Giridhar Reddy) శుక్రవారం తెలుగు దేశం పార్టీ (Telugu Desam) తీర్థం పుచ్చుకోనున్నారు.
తన భార్య ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే ఆమె పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. భర్త శివకుమార్... ప్రియుడితో వెళ్లిన తన భార్య కవిత పైన గురువారం యాసిడ్ పోశాడు. ఈ దాడిలో ఆమెతో పాటు ఆమెకు సమీపంలో ఉన్న మరో ఐదుగురు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) తమ పార్టీకి చెందిన ఇద్దరు క్రాస్ ఓటింగ్‌కు (Cross Voting) పాల్పడ్డారని, వారిని గుర్తించామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. వారి పేర్లను ఇప్పుడే చెప్పబోమన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) గట్టి షాక్ తగిలింది. 2019లో టీడీపీ (Telugu Desam Party) నుండి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మద్దతు పలుకుతారని, దీంతో తాము రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని జగన్ (YS Jagan, chief minister of andhra pradesh) ధీమాగా ఉన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డ...
మాంద్యం, రికార్డు ద్రవ్యోల్బణం నేపథ్యంలో అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా యాక్సెంచర్(Accenture) కూడా చేరింది. 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే మెటా, గూగుల్, అమెజాన్ వంటి సాంకేతిక దిగ్గజాలు తొలగింపులను ప్రకటించాయి.
ఈ ఏడాది ఐపీఎల్ 2023(ipl 2023) మరింత రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే కీలక మార్పులు చేశారు. టాస్ తర్వాత వారు 11 మందిని ఎంపిక చేసుకోనున్నారు. ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేసినా లేదా ముందుగా బౌలింగ్ చేసినా తమ అత్యుత్తమ 11 మందిని ఎంచుకోవడానికి ఇది అనుమతిస్తుందని IPL అంతర్గత నోట్లో పేర్కొంది.
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Supreme court twist:ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే మూడుసార్లు.. దాదాపుగా 30 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న (21వ తేదీన) కవితను విచారించి.. పంపించారు. తదుపరి విచారణ ఎప్పుడో తెలియజేయలేదు. అరగంటలో మెయిల్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో కవిత అండ్ కో..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(ap cm jagan)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ(Nara Lokesh) రాశారు. ఏపీలో నిర్వహించనున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షకు ఉద్యోగార్థులకు మరో 90 రోజుల అదనపు సమయం ఇవ్వాలని కోరారు.
Inter student get a heart stroke:మారుతున్న జీవన విధానం.. శారీరక శ్రమ లేకపోవడంతో... పెద్ద, చిన్న అనే తేడా లేకుండానే హార్ట్ స్ట్రోక్స్ (heart stroke) వస్తున్నాయి. ఇటీవల వరసగా గుండె పోటు వార్తలు చూశాం. ఇప్పుడు మరో విద్యార్థినికి కూడా స్ట్రోక్ వచ్చింది. సరయిన సమయంలో 108 సిబ్బంది స్పందించడంతో.. ఆ విద్యార్థినికి (student) ప్రాణాప్రాయం తప్పింది.
YS Sharmila:సీఎం కేసీఆర్‌పై షర్మిల (YS Sharmila) నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువతకు ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రెండోసారి సీఎం అయ్యాక ఒక ఉద్యోగం కూడా కల్పించలేదన్నారు. బిస్వాల్ కమిటీ చెప్పినట్టు 1.91 లక్షల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. అలాగే టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఇటీవల కేరళ నటి అంజు కృష్ణను డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై త్రివేండ్రంలోని కజకుట్టంలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ విక్రయిస్తూ అరెస్టయిన నటి తాను కాదని సినీ నటి అంజు కృష్ణ అశోక్ స్పష్టం చేశారు. పేరులోని సారూప్యత వల్లే సమస్య వచ్చిందని, తనకు తెలియకుండానే సోషల్ మీడియాలో చాలా మంది ట్యాగ్ చేస్తున్నారని చెప్పింది. అంజు కృష్ణ అనే నాటక నటిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసింది.