"Nandini Better Brand, Don't Need Amul":DK Shivakumar
Nandini Better Brand:కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) ఈ రోజు హసన్‌లో నందిని మిల్క్ పార్లర్‌ను (nandini milk) సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆమూల్ బ్రాండ్ (amul brand) కన్నా.. నందిని (nandini) మంచి బ్రాండ్ అని చెప్పుకొచ్చారు. కర్ణాటకకు చెందిన నందిని ప్రమోట్ చేస్తామని అంటున్నారు. గుజరాత్‌కు (gujrat) చెందిన ఆమూల్ తమకొద్దు అని ఇండైరెక్టుగా చెప్పేశారు.
ఇక నుంచి నందిని (nandini) ప్రొడక్ట్స్ కొనుగోలు చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. కర్ణాటక నేల గట్టిదని.. తమకు ఆమూల్ (amul) వద్దని.. దానికి సంబంధించి నీరు, పాలు వద్దే వద్దు అని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన 70 లక్షల మంది రైతులు పాలను నందిని కేంద్రాలకు ఇస్తున్నారని గుర్తుచేశారు. ఆమూల్ (amul) కూడా గుజరాత్ (gujrat) రైతులది అని.. కానీ నందిని బ్రాండ్ కాదని.. ఆమూల్ను ప్రమోట్ చేయలేం కదా అన్నారు. ఇక్కడి బీజేపీ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాయం చేయలేదన్నారు. మనం మన వస్తువులను, అలాగే రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కర్ణాటక బీజేపీ ప్రభుత్వం పాలు, పాల్ప ఉత్పత్తుల ధరను మాత్రం పెంచింది. కానీ రైతులకు ఎలాంటి మేలు చేయలేదని డీకే శివకుమార్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మేముంటే ఆమూల్ పాల విక్రయాలు జరిపే వాళ్లం కాదన్నారు.
రాష్ట్రంలోకి ఆమూల్ బ్రాండ్ రాకను వ్యతిరేకిస్తూ బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక ఆందోళనకు దిగింది. బెంగళూర్‌లో తమ ఉత్పత్తులను విక్రయిస్తామని ఆమూల్ ప్రకటించగా.. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.