Karnataka Assembly Elections Results:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కర్ణాటకలో గల 36 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు ట్రెండ్స్ తెలియనుంది. మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత రానుంది.
224 నియోజకవర్గాలకు ఈ నెల 10వ తేదీన ఓకేసారి పోలింగ్ జరిగింది. మొత్తం 73.19 శాతం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో అధికారం చేపట్టాలంటే 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఏ పార్టీకి మెజార్టీ రాకుంటే హంగ్ తప్పదు. ఎగ్జిట్ పోల్స్ (Exit polls) అయితే హంగ్ తప్పదని అంచనా వేశాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
హంగ్ వస్తోందని ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో కర్ణాటకలో క్యాంపు రాజకీయాలు ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యేలు చేజారకుండా ప్రధాన పార్టీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బెంగళూర్ రప్పించినట్టు తెలిసింది. మరోసారి జేడీయూ కింగ్ మేకర్ అవుతుందని తెలుస్తోంది. 2018లో కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 116 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ 69, జేడీఎస్ 29, బీఎస్పీకి ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. రాజీనామా, చనిపోవడంతో ఆరు సీట్లు ఖాళీగా ఉన్నాయి.