»Amuls Fresh Milk Will Soon Be Available For Indians In America
Amul : అమెరికన్ మార్కెట్లోకి అమూల్ తాజా పాలు
భారత దేశానికి బయటి వైపు మొదటి సారి తమ తాజా పాలను అందించేందుకు ప్రముఖ డైరీ ఉత్పత్తుల కంపెనీ అమూల్ సిద్ధమవుతోంది. దీంతో ఇకపై అమూల్ తాజా పాలు అమెరికాలో అందుబాటులోకి రానున్నాయి.
Amul : గుజరాతీ పాల ఉత్పత్తుల కంపెనీ అయిన అమూల్ భారత దేశం వెలుపలు తాజా పాలను(Fresh Milk) విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుకుంటోంది. దీంతో ఇలా భారతీయ పాలను అమూల్ బయట విక్రయించడం ఇదే ప్రధమం. అమెరికన్ మార్కెట్లో తమ తాజా పాలను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నాలుగు రకాల పాలను తొలుత విక్రయించనున్నట్లు వెల్లడించింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయేన్ మెహతా ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికన్ మార్కెట్లో తమ పాలను అమ్మేందుకు ఆ దేశంలో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు మిచిగన్ పాల ఉత్పత్తుల సంఘంతో ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, వాషింగ్టన్, డాలస్, టెక్సాస్ తదితర చోట్ల అమూల్ పాలు మరి కొద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అక్కడుంటున్న భారతీయులతోపాటు(Indians) ఆసియన్లకు ఇవి అందుబాటులో ఉంటాయన్నారు.
అమూల్(Amul) సంస్థ డైరీ ఉత్పత్తులను ఎన్నో ఏళ్లుగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తోంది. అయితే తాజా పాలను( Fresh Milk) పంపించడం మాత్రం ఇదే ప్రధమం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఒక వారం రోజుల్లోనే అమూల్ పాల ప్యాకెట్లు అమెరికన్ స్టోర్లలో కనిపించనున్నాయి.