AAP recognised as national party; TMC, NCP, CPI lose status
AAP recognised as national party:ఆప్‌కు (AAP) గుడ్ న్యూస్.. ఆ పార్టీని జాతీయ పార్టీగా భారత ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి పారా 6బీ (3) ప్రకారం జాతీయ పార్టీ హోదా కల్పించారు. ఢిల్లీతోపాటు గోవా (Goa), పంజాబ్ (punjab), ఇటీవల గుజరాత్లో (gujrat) ఆ పార్టీ ప్రభావం చూపడంతో నేషనల్ పార్టీగా గుర్తించారు.
మూడు పార్టీలు జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. తృణమూల్ కాంగ్రెస్ (tmc), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ncp), సీపీఐ (cpi) జాతీయ పార్టీ హోదాను కోల్పోయాయి. రెండు పార్లమెంట్ ఎన్నికలు, 21 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది.
నాగాలాండ్‌లో ఎన్సీపీ, లోక్ జనశక్తి పార్టీ, మేఘాలయలో టీఎంసీ, వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ, త్రిపురలో తిప్ర మోత పార్టీని రాష్ట్ర పార్టీగా గుర్తింపును ఇచ్చింది.
మణిపూర్‌కు చెందిన పీడీఏ, పుదుచ్చేరికి చెందిన పీఎంకే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్ఎల్డీ, ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్ఎస్పీ, మిజోరంకు చెందిన ఎంపీసీ రిజిష్టర్డ్ ఆన్ రికగ్నైజ్డ్ పార్టీలు గుర్తించింది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర హోదా రాకపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆ పార్టీ ఆశ ఆడియాసే అయ్యింది.
బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదాను ఈసీ ఉపసంహరించింది. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు కానీ, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లు సాధించాల్సి ఉంటుంది. 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చి ఉండాలి.
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క చోట కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ తెలిపింది.