• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

PM MODI: మరోసారి ప్ర‌ధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం..వీడియో వైరల్

కర్ణాటక(Karnataka)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) రోడ్ షోలో పాల్గొనగా మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. శనివారం కర్ణాటకలోని దావణగిరిలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ(Rally)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

March 25, 2023 / 09:17 PM IST

CORONA ALERT: మళ్లీ కరోనా టెన్షన్..ఆ రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు(Corona New Cases) అధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా(Corona)తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.

March 25, 2023 / 06:48 PM IST

CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం… రూటు మార్చిన సీఎం జగన్..!

CM Jagan : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం సీఎం జగన్ పై బాగా ఎక్కువగా పడిందనే చెప్పాలి. ఈ ప్రభావం ఆయన ఈ రోజు దెందులూరు సభలో స్పష్టంగా కనపడుతోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.... సీఎం జగన్ ఈ రోజు దెందులూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

March 25, 2023 / 06:13 PM IST

Mango Prices: నగర వాసులకు బ్యాడ్ న్యూస్..పెరగనున్న మామిడి ధరలు!

అడపాదడపా కురుస్తున్న వర్షాల(rains) కారణంగా వేసవి తాపం నుంచి నగరవాసులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, మామిడి ప్రియులకు(mango lovers) మాత్రం ఇది చేదువార్త అని చెప్పవచ్చు. అకాల వర్షాలు సహా చీడ పీడల కారణంగా మామిడి పండ్ల ఉత్పత్తి తగ్గిపోయిందని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో మామిడి పండ్ల సరఫరా తక్కువగా ఉండడంతో ధరలు(prices) ఎక్కువగా ఉంటాయని, వాటిని కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారే అవకాశం ఉంది.

March 25, 2023 / 02:43 PM IST

Rahul Gandhi: నా తర్వాత ప్రసంగం గురించి మోదీ భయపడుతున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) తన తదుపరి ప్రసంగానికి భయపడి అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. ఆయన కళ్లలో భయం కనిపించిందని, అందుకే తనను పార్లమెంట్‌లో మాట్లాడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని తాను కోరినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

March 25, 2023 / 02:01 PM IST

Jagan: బాబు గతంలో రుణాలు కట్టొద్దని మహిళలను తప్పుదొవ పట్టించారు

ఏపీలో వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం జగన్(ap cm jagan) బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ క్రమంలో మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు గుర్తు చేశారు. మరోవైపు చంద్రబాబు (chandrababu naidu)మాత్రం మహిళలకు డ్వాక్రా రుణాలు(dwcra loans) కట్టవద్దని తప్పుదొవ పట్టించారని జగన్ అన్నారు.

March 25, 2023 / 01:17 PM IST

Bandi Sanjay: నిరుద్యోగులకు రూ.లక్ష నిరుద్యోగ భృతి ఇవ్వాలి

తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని బీజేపీ(BJP) తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) డిమాండ్ చేశారు. మరోవైపు TSPSC లికేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరిపించడం లేదని సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. లేదంటే ట్విట్టర్ టిల్లు ఈ కేసుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని సవాల్ చేశారు.

March 25, 2023 / 12:48 PM IST

AP TDP నేత చింతకాయల విజయ్‌కు మరోసారి సీఐడీ నోటీసులు

ఏపీ టీడీపీ నేత చింతకాయల విజయ్(Chintakayala Vijay)కి సీఐడీ(CID) మరోసారి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై మార్చి 28న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.

March 25, 2023 / 12:14 PM IST

Manchu Vishnu: మనోజ్ వీడియోపై స్పందించిన విష్ణు..మెహన్ బాబు సిరీయస్!

మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.

March 25, 2023 / 11:46 AM IST

Muslim Reservation: కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ కోటా రద్దు

కర్నాటక ప్రభుత్వం శుక్రవారం ఇతర వెనుకబడిన తరగతుల (OBC) ముస్లింలకు 4 శాతం(Muslim 4% Reservation) కోటాను రద్దు చేసింది. ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల(Reservations) కోసం రెండు కొత్త కేటగిరీలను ప్రకటించింది. ఇప్పుడు 4 శాతం ఓబీసీ ముస్లిం కోటాను వొక్కలిగాలు, లింగాయత్‌ల మధ్య విభజించారు. కోటాకు అర్హులైన ముస్లింలు ఇప్పుడు ఆర్థికంగా బలహీన వర్గాల ఈడబ్ల్యూఎస్(EWS) కేటగిరీలో 10 శాతం కిందకు చేర్చబడ్డారు.

March 25, 2023 / 10:44 AM IST

Rahul Gandhiపై వేటు సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న కాంగ్రెస్

రాహుల్ గాంధీ(Rahul gandhi) లోక్ సభ సభ్యత్వం రద్దు అంశంపై కాంగ్రెస్ నేతలు(congress leaders) అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం ఈ అంశంపై సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది. సూరత్ కోర్టు(surat court) తీర్పును సవాలు చేయడంతోపాటు మరిన్ని అభిప్రాయాలను కాంగ్రెస్ తెలుపనున్నట్లు సమాచారం. మరోవైపు రాహుల్ గాంధీ వేటును భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా పలువు...

March 25, 2023 / 10:15 AM IST

TSPSC లీకేజీ కేసులో మరొకరు అరెస్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్(SIT) వేగం పెంచింది. తెలంగాణలో సంచలనంగా తయారైన TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో మరొకరు అరెస్టు అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్(prashanth)ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

March 25, 2023 / 09:54 AM IST

Fire Accident: హైదరాబాద్లో కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్(hyderabad) నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ అగ్ని ప్రమాదం దాటికి కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కింగ్ కోఠి(king koti)లో చోటుచేసుకుంది.

March 25, 2023 / 09:01 AM IST

WPL 2023లో యూపీపై గెలుపు..ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్‌

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) ఎలిమినేటర్‌ మ్యాచులో ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు.. యూపీ వారియర్జ్‌(UP Warriorz)పై 72 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌ స్కివర్‌ బ్రంట్‌(72) పరుగులు చేయగా, పేసర్ ఇస్సీ వాంగ్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఫైనల్ పోరులో రేపు ఢిల్లీతో ముంబయి జట్టు తలపడనుంది.

March 25, 2023 / 08:13 AM IST

Dil Raju: దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ..ఈ పార్టీ నుంచే?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

March 24, 2023 / 07:29 PM IST