Rs 2 lakh to women who marry farmers' sons: Kumaraswamy
Kumaraswamy:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అంటూ చెబుతున్నారు. ఇప్పుడు మాజీ సీఎం, జేడీఎస్ ముఖ్యనేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) వంతు వచ్చింది. యువతను ముఖ్యంగా మహిళా ఓట్లను ఆకర్షించే పనిలో ఉన్నారు.
కొలార్లో (kolar) గల పంచరత్నలో జరిగిన ర్యాలీలో కుమారస్వామి (Kumaraswamy) పాల్గొన్నారు. రైతుల పిల్లల పెళ్లికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అన్నదాత కుమారుడిని పెళ్లి చేసుకుంటే యువతికి రూ.2 లక్షలు (rs.2 lakhs) ఇస్తామని ప్రకటన చేశారు.
రైతుల కుమారులను పెళ్లి చేసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయం కుమారస్వామి (Kumaraswamy) దృష్టికి వచ్చింది. పెళ్లికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఇదీ రైతుల కొడుకులు ఆత్మగౌరవంతో బతికేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ఈ పథకం తర్వాత యువతు ముందుకు వస్తారని తెలిపారు.
వచ్చే నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి (karnataka assembly) ఓకే విడతలో ఎన్నిక జరగనుంది. 13వ తేదీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి.. అదే రోజు ఫలితం ప్రకటిస్తారు. రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 123 సీట్లలో జేడీఎస్ పోటీ చేస్తోంది. ఇప్పటికే 93 మంది అభ్యర్థులను కుమారస్వామి పార్టీ ప్రకటించింది.