»Sachin Pilot On Dharna Bjp Calls It Open Challenge To High Command Anti Party Activitycongress
Sachin one day fast.. ఓపెన్ ఛాలెంజ్ అంటోన్న బీజేపీ.. యాంటీ పార్టీ యాక్టివిటీ: కాంగ్రెస్
రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఒకరోజు దీక్ష చేపట్టారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు.
Sachin Pilot on dharna: BJP calls it 'open challenge to high command', anti-party activity:Congress
Sachin Pilot:రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్య నేత సచిన్ పైలట్ (Sachin Pilot) ఒకరోజు దీక్షకు దిగారు. సొంత ప్రభుత్వంపై వ్యతిరేకంగా దీక్షకు దిగారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లట్ (gehlot) చర్యలు తీసుకోవడం లేదని.. అందుకు నిరసనగా దీక్షకు దిగారు. సచిన్ ఫైలట్ (Sachin Pilot) దీక్షకు దిగడంతో అధికార కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికి గురిచేసింది. పైలట్ దీక్ష కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ చాలెంజ్ అని బీజేపీ (bjp) స్పందించింది. దీక్ష చేయడం తగదని.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు వస్తోందని కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది.
దీక్ష గురించి పైలట్ (pilot) తనకు చెప్పలేదని రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సుఖీందర్ సింగ్ రాంద్వానా తెలిపారు. ధర్నా చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకు వస్తోందని తెలిపారు. సమస్య గురించి డిస్కష్ చేస్తే బాగుండేదని తెలిపారు. పైలట్ తమ ఆస్తి అని.. అతనిని శాంతపరిచే ప్రయత్నం చేశారు. దీక్షపై వెనక్కి తగ్గాలని మరోసారి రిక్వెస్ట్ చేశారు. సమస్యపై పార్టీలో చర్చించాలని, బయట కాదని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. సమస్య ఏదైనా సరే.. లోపల మాత్రమే చర్చించాలని అన్నారు. ఇష్యూ గురించి సీఎంకు రిపోర్ట్ చేయాలని.. సమస్యను బయటకు తీసుకురావడం తప్పు అని తెలిపారు.
రాజస్థాన్ సీఎం రేసులో.. 2018లో అశోక్ గెహ్లట్తోపాటు సచిన్ పైలట్ (Sachin Pilot) కూడా ఉన్నారు. సోనియా గాంధీ (sonia gandhi) గెహ్లట్ వైపు మొగ్గుచూపడంతో.. పైలట్‌కు పదవీ వరించలేదు. ఆ తర్వాత ధిక్కార స్వరం వినిపించి.. హర్యానాలో ఎమ్మెల్యేలతో క్యాంప్ వేసినప్పటికీ.. వసుంధర రాజే (vasundhara raje) అడ్డగించారు. బీజేపీలో చేరేందుకు బ్రేక్ వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.
రాజస్థాన్ అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నిక జరగనుంది. 8 నెలల్లో ఎన్నికలు ఉండగా.. పైలట్ (Sachin Pilot) మాత్రం గెహ్లట్‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఎక్సైజ్ మాఫియా, అక్రమంగా ఇసుక తరలింపు, భూ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. లలిత్ మోడీ అఫిడవిట్ కేసును కూడా ప్రస్తావించారు. వసుంధర రాజే (raje) అండ్ కోపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సచిన్ పైలట్ (Sachin Pilot) అడుగుతున్నారు. మరో 6 నుంచి 7, 8 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో కూడా చర్యలు తీసుకోకపోతే ఎలా? తర్వాత యాక్షన్ తీసుకుంటామని చెబితే కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం పెరుగుతుందని.. తాము చెప్పే మాటలు, చేతలకు సంబంధం ఉండదని చెప్పారు.
వసుంధర రాజేకి (raje) సంబంధించి గతంలో సీఎం అశోక్ గెహ్లట్ ప్రదర్శించిన వీడియోలను సచిన్ పైలట్ మీడియాకు చూపించారు. అవినీతి పాలనకు సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలు జారీచేయలేదని అడిగారు. అవినీతికి సంబంధించి తమ ప్రభుత్వం వద్ద ఆదారాలు ఉన్నాయని.. కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే.. మరోసారి ఎన్నికలకు వెళ్లడం కుదరదని తేల్చిచెప్పారు. ఆధారాలు ఉన్నప్పుడు విధిగా చర్యలు తీసుకోవాలని కోరారు. దర్యాప్తు చేయించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. అందుకోసమే ఈ రోజు ధర్నా చేపట్టారు. ఇదీ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేసింది.