»Stock Markets Ended With A Gain Of 532 Points Bank Nifty April 11th 2023
Stock markets: 532 పాయింట్ల లాభంతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు(indian stock market) మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్(sensex) 311 పాయింట్లు, నిఫ్టీ 98, బ్యాంక్ నిఫ్టీ సూచీ 532 పాయింట్లు పెరిగి లాభాలతో పూర్తయ్యాయి.
december 15th 2023 stocks are soaring in profit sensex gain 440 points
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(tuesday) స్వల్ప లాభాలతో(heavy losses)ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనుకూల ధోరణుల దృష్ట్యా దేశీయ మార్కెట్లు కూడా ఎగువకు పయనించాయి. ఈ క్రమంలో బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 311 పాయింట్లు వృద్ధి చెందగా, ఎన్ఎస్ఈ(NSE) నిప్టీ 98 పాయింట్లు పెరిగింది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ(BANK NIFTY) సూచీ ఏకంగా 532 పాయింట్లు ఎగబాకింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 60,158 పాయింట్ల వద్ద ఉండగా, నిఫ్టీ 17,722 దగ్గర, ఇక బ్యాంక్ నిఫ్టీ 41,366 వద్ద స్థిరపడ్డాయి.
ఈ వారంలో FY23 కోసం తమ నాల్గవ త్రైమాసిక ఆదాయాలను ప్రకటించడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో IT ఇండెక్స్ స్టాక్స్(in index stocks) కొంచెం ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు నిన్న నష్టాల్లో కొనసాగిన బ్యాంకింగ్ స్టాక్స్(banking stocks) ఈరోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. మరోవైపు గోల్డ్ రేటు తగ్గడంతోపాటు డాలర్ విలువ కూడా కొంచెం తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఆసియా మార్కెట్లు సైతం లాభాలతో కొనసాగడం కూడా భారతదేశ స్టాక్ మార్కెట్లకు తోడ్పాటునిచ్చినట్లైంది.
ఈ నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ సంస్థల స్టాక్స్ అన్ని కూడా దాదాపు లాభాల్లోకి(profits) దూసుకెళ్లాయి. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ, రిలయన్స్, ఐటీసీ సంస్థలు టాప్ లో కొనసాగాయి. మరోవైపు టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పేయింట్స్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ వంటి సంస్థల స్టాక్స్ మార్కెట్ ముగిసే నాటికి నష్టాల్లోకి జారుకున్నాయి.