»Stock Market Holiday This Week And Currency Market Holiday This Week
Stock Market Holiday: ఈ వారం స్టాక్ మార్కెట్‌కి 2 రోజులు సెలవు
భారత దేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవుదినం రోజున దేశంలోని స్టాక్ మార్కెట్లు కూడా క్లోజ్ చేస్తారు.
indian stock market losses december 21st 2023 sensex loss 440 points
Stock Market Holiday: భారత దేశం తన 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవుదినం రోజున దేశంలోని స్టాక్ మార్కెట్లు కూడా మూసివేయబడతాయి. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ)లకు సెలవు. ఈ రెండు ప్రధాన ఇండెక్స్‌లలో ఎటువంటి పనులు జరుగవు. ఈ రోజు తర్వాత ట్రేడింగ్ నేరుగా బుధవారం స్టాక్ మార్కెట్లో జరుగుతుంది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరుగదు. కరెన్సీ మార్కెట్లో, మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా ట్రేడింగ్‌కు సెలవు ఉంటుంది. BSE వెబ్సైట్ ప్రకారం ఆగస్టు 15 న ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, SLB సెగ్మెంట్లో ట్రేడింగ్ జరుగదు. మంగళవారం కమోడిటీ మార్కెట్లో ఉదయం సెషన్, సాయంత్రం సెషన్ రెండింటిలోనూ ట్రేడింగ్ మూసివేయబడుతుంది.
కరెన్సీ మార్కెట్లో ట్రేడింగ్ ఈ వారం రెండు రోజులు మూసివేయబడుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న కరెన్సీ డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ ఉండకపోగా, ఆగస్టు 16న పార్సీ న్యూ ఇయర్ (నవ్రోజ్) సందర్భంగా కరెన్సీ మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ ఉండకపోవడమే ఇందుకు కారణం. ఈ సంవత్సరం గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 19), మహాత్మా గాంధీ జయంతి (అక్టోబర్ 2), దసరా (అక్టోబర్ 24), దీపావళి (నవంబర్ 14), గురునానక్ జయంతి (నవంబర్ 27), క్రిస్మస్ (డిసెంబర్ 25) స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరగదు.