Viral Monkey Video: స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కరోనా వచ్చిన తర్వాత పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ అత్యవసర వస్తువుగా మారింది. ఇంటర్నెట్ చౌక కావడంతో ప్రస్తుతం తిండి లేకున్నా ఫర్వాలేదు.. స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయకుండా అర నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీని గ్రిప్‌లోకి వెళ్లి పోయారు.
జంతువులు కూడా స్మార్ట్ ఫోన్ వ్యామోహంలో పడ్డాయి. జంతువులలో కోతులు అనుకరణ ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక క్లిప్ తెరపైకి వచ్చింది. ఇందులో కోతులు జనాలపై నుంచి మొబైల్ స్క్రోలింగ్ కళను ఎలా నేర్చుకున్నాయో.. మన లాగే హాయిగా ఫోన్లను ఉపయోగించడంలో ఎలా ప్రవీణులుగా మారారో చూడవచ్చు. వీడియోలో ఒక కోతి మంచంపై హాయిగా పడుకుని మనుషుల మాదిరిగా రీల్స్‌ను స్క్రోలింగ్ చేస్తూ కనిపించడం చూడవచ్చు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటికే ఎన్నో కోట్ల మంది వీక్షించారు. వీడియో పై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.