Instagram: కొందరు భార్యభర్తల గొడవలు (Husband and wife quarrels) విడాకులకు దారితీస్తున్నాయి. ఇక్కడ మాత్రం మరణానికి దారి తీస్తోంది. ఉత్తరప్రదేశ్( Uttar Pradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య మీద అనుమానంతో ఆమెను కిరాతకంగా చంపాడు భర్త. ఉత్తర ప్రదేశ్‌లోని లఖ్‌నవూకు చెందిన ఓ వ్యాపారవేత్త (37)కు పైళ్లై 12 ఏళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. అతడి భార్య గృహిణి. వ్యాపకంగా మొదలు పెట్టిన తన ఇన్స్టాగ్రామ్(Instagram)లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తను ఇంట్లో ఉండి రీల్స్ చేస్తూ ఉండేది. అది భర్తకు నచ్చేది కాదు. వద్దని వారించడంతో అతన్ని బ్లాక్ చేసింది. దాంతో అతనికి కోపం వచ్చింది. ఈ విషయమై వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి.
తన భార్యకు ఎవరితో ఎఫైర్ ఉందనే అనుమానం పెట్టుకున్నాడు. ఆదివారం పిల్లలతో కలిసి కారులో బయటకు వెళ్తుండగా మరోసారి గొడవ జరిగింది. కోపంతో పిల్లల ముందే భార్యను గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత అదే వాహనంలో లాక్ చేశాడు. చాలా సమయం లాక్ చేయడంతో పెట్రోలింగ్ బృందం ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి వచ్చి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.