NRML: పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాత్రికేయులు శనివారం వినూత్నంగా నిరసన తెలిపారు. పాత్రికేయులు నల్ల దుస్తులు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. గత ఐదు రోజులుగా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిరసన చేపట్టిన ప్రభుత్వం పుట్టించుకోవడం లేదన్నారు.