E.G: రాజమండ్రి నిర్మాణంలో ఉన్న భవనాలు అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా శనివారం ఆదేశించారు. ఇటీవల గాంధీనగర్, గాదాలమ్మ నగర్ ప్రాంతాల్లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి భవనాలను పరిశీలించారు. ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే తక్షణ చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.