»Indian Stock Market Closes In Green After Decent Buying In It Banking And Mid Cap Stocks Nifty Closes Above 19000 Mark
Stock Market Closing: ఆరు రోజుల తర్వాత ఇన్వెస్టర్ల మొఖంలో సంతోషం.. 600పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్
టి ట్రేడింగ్‌లో బిఎస్ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ గత ట్రేడింగ్ సెషన్లో రూ.306.21 లక్షల కోట్లుగా ఉన్న రూ.310.54 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.4.33 లక్షల కోట్లు పెరిగింది.
BJP win in three states sensex increased thousand points on december 4th 2023
Stock Market : వారం చివరి ట్రేడింగ్ రోజున భారత స్టాక్ మార్కెట్ అద్భుతంగా రాణించింది. ఆరు రోజుల నిరంతర పతనం తర్వాత అక్టోబర్ 27 నాడు మార్కెట్ అద్భుతమైన పెరుగుదలతో ముగిసింది. బ్యాంకింగ్ , ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో భారీగా ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడి పెట్టారు. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 634 పాయింట్ల లాభంతో 63,782 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 190 పాయింట్ల జంప్‌తో 19,000 పాయింట్ల మార్కును అధిగమించి 10,047 పాయింట్ల వద్ద ముగిసింది.
నేడు మార్కెట్లో దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు కనిపించడం మార్కెట్‌కు భారీ మద్దతునిచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 501 పాయింట్లు లేదా 1.19 శాతం జంప్‌తో 42,782 పాయింట్ల వద్ద ముగిసింది. ఎఫ్ఎంసిజి స్టాక్స్‌లో కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ ఐటి 1.24 శాతం, నిఫ్టీ ఆటో 1.35 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసిజి 0.89 శాతం పెరుగుదలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో మెటల్స్, మీడియా, ఎనర్జీ, ఇన్ఫ్రా, హెల్త్‌కేర్ రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. మిడ్ క్యాప్, స్మాల్ స్టాక్స్‌లో కూడా బలమైన కొనుగోళ్లు కనిపించాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.54 శాతం పెరుగుదలతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.01 శాతం పెరుగుదలతో ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 27 లాభాల్లో, 3 నష్టాలతో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో బిఎస్ఇలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ గత ట్రేడింగ్ సెషన్లో రూ.306.21 లక్షల కోట్లుగా ఉన్న రూ.310.54 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.4.33 లక్షల కోట్లు పెరిగింది.