»China Police Rescues Hundreds Of Cats From Being Slaughter Anger On Chinese Social Media
China: చైనాలో మటన్ పేరు చెప్పి పిల్లుల మాసం అమ్ముతున్నారు
చైనాలో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలో పోలీసులు ట్రక్కులో తరలిస్తున్న వేల సంఖ్యలో పిల్లుల ప్రాణాలను కాపాడారు. వాటి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్గా నమ్మించి విక్రయించే ప్రయత్నాన్ని తిప్పి కొట్టారు.
China: చైనాలో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలో పోలీసులు ట్రక్కులో తరలిస్తున్న వేల సంఖ్యలో పిల్లుల ప్రాణాలను కాపాడారు. వాటి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్గా నమ్మించి విక్రయించే ప్రయత్నాన్ని తిప్పి కొట్టారు. ఇదిలా ఉండగా జంతువుల కోసం పనిచేస్తున్న సంస్థల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుని పిల్లుల ప్రాణాలను కాపాడారు. జాంగ్జియాగాంగ్ నగరంలో ఓ ట్రక్కు నుంచి పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పిల్లుల ప్రాణాలను కాపాడి జంతు సంరక్షణ కేంద్రంలో ఉంచారు. దీంతో పిల్లి మాంసం అక్రమ వ్యాపారాన్ని బహిర్గతం అయింది. ఈ చర్య వెలుగులోకి రావడంతో చైనీయులలో ఆహార భద్రత పై ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. చైనాలో 600 గ్రాముల పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు పలుకుతోంది. చైనీస్ పోలీసులు ప్రాణాలు కాపాడిన పిల్లులను పంది మాంసం, మటన్ గా నమ్మించి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారు.
ఇంత పెద్ద మొత్తంలో వందలాది పిల్లులు ఎక్కడ నుండి వచ్చాయో పోలీసులకు స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం వారు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం వెల్లడికావడంతో చైనా సోషల్ మీడియాలో ప్రజల బీభత్సమైన కామెంట్స్ చేస్తున్నారు. చైనా సోషల్ మీడియా వీబోలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రతపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్గా విక్రయించబోతున్నారని తెలియగానే వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రెస్టారెంట్ ఫుడ్ తినబోమని కొందరు సోషల్ మీడియాలో ప్రతిజ్ఞ కూడా చేశారు.