»The Media Questioned Raghav Chadha Again About Dating Parineeti Chopra Dating Do You Know What He Said
Parineeti Chopra:తో డేటింగ్‌పై మళ్లీ రాఘవ్ చద్దాను ప్రశ్నించిన మీడియా..ఏం చెప్పారో తెలుసా?
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha), బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra) డేటింగ్ చేస్తున్నట్లు వచ్చిన పుకార్లపై మళ్లీ ఎంపీని తాజాగా మీడియా ప్రశ్నించింది. ఆ క్రమంలో అతను ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)ను నటి పరిణీతి చోప్రాపై డేటింగ్ గురించి ఓ జాతీయ మీడియా తాజాగా ప్రశ్నిచింది. ఆ క్రమంలో ఆయన నవ్వుతూ ఇలా అన్నారు. మీకు చెప్తాను. త్వరలో కలిసి ఇంటర్వ్యూ చెద్దామని చెప్పుకుంటూ వెళ్లారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నికల సంఘం ‘జాతీయ’ పార్టీగా గుర్తించిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ పార్టీని ప్రారంభించినప్పుడు తామంతా ఉద్యోగాలు వదులుకుని చేరామని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు పార్టీ చాలా దూరం వెళ్ళిందని అన్నారు. 10 ఏళ్లలో పార్టీ ఎంతో సాధించిందని అన్నారు. ఆప్ ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. 10 కంటే ఎక్కువ ఎంపీలు, డజన్ల కొద్దీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ దేశాన్ని పరిపాలించే రోజు ఎంతో దూరంలో లేదని వెల్లడించారు.
హీరోయిన్లు హీరోలతో, క్రికెటర్లతో, రాజకీయ నాయకులతో ప్రేమలో పడడం చూస్తునే ఉంటాం. వారిలో కొంతమంది పెళ్లిళ్లు చేసుకొని సంసార జీవితానికే అంకిమవుతుంటారు. కొందరు మాత్రం కొన్నాళ్లకే విడిపోయి.. ఇంకొకరితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటారు. హీరోయిన్ల విషయాల్లో ఇదంతా కామన్ అనే టాక్ వింటునే ఉంటాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఓ బడా పొలిటీషియన్తో రెస్టారెంట్లో కెమెరా కంట పడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(social media)ను షేక్ చేస్తోంది. బాలీవుడ్ హీరోయిన్లలో అనుకున్నంత స్థాయిలో స్టార్డమ్ అందుకోలేదు కానీ అమ్మడి అందానికి ఫిదా కానీ వారుండరనే చెప్పవచ్చు. చేసిన కొద్ది సినిమాలు కూడా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చాయి.
ఆమె మరెవరో కాదు పరిణీతి చోప్రా(Parineeti Chopra). ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. చూపు తిప్పుకొని అందం ఆమె సొంతం. ఈమె స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజీన్. సినిమాల కంటే ఎక్కువగా ఫారిన్ టూర్లతోనే ఫుల్ బిజీగా ఉంటుంది అమ్మడు. 2011లో ‘లేడీస్ వర్సెస్ రికీ భల్’ మూవీతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. కాకపోతే సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
ఇటీవల ఈ బ్యూటీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా(Raghav Chadha)తో కలిసి కనిపించింది. ఓ రెస్టారెంట్లో నుంచి బయటకు వస్తుండగా వీళ్లిద్దరూ మీడియా కెమెరాల కంటికి చిక్కారు. దీంతో ఇద్దరు డేటింగ్లో ఉన్నారంటూ.. బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది. కానీ పరిణీతి, రాఘవ్‌లు మాత్రం ఇప్పటి వరకు దీనిపై రెస్పాండ్ అవ్వలేదు. దీంతో డేటింగ్ రూమర్స్‌లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఎయిర్ పోర్టు వీరి డేటింగ్ గురించి పరిణితి ఓ మీడియా అడుగగా నవ్వుతూ చెప్పకుండానే వెళ్లిపోయింది.