గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు సిటీలో ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందే రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
80 ఏళ్ల వయస్సులో షారుక్ ఖాన్‌తో కలిసి నటించేందుకు సిద్దమని రాణి ముఖర్జీ తెలిపారు. వీరిద్దరూ కలిసి పలు హిట్ మూవీస్‌లో నటించి.. మెప్పించిన సంగతి తెలిసిందే.
1500 మంది బృందాలు కష్టపడి పని చేశారు. 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులు కంటి వెలుగు పరీక్షలు చేసుకున్నారు. 7 వేల గ్రామ పంచాయతీల్లో పరీక్షలు జరిగాయి.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టై పైన ఆ పార్టీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హన్మకొండ కోర్టు విధించిన రిమాండును రద్దు చేయాలని కోరారు.
తనకు కాంగ్రెస్ హయాంలోనే పద్మ అవార్డు వస్తుందనుకున్నానని, కానీ ఇవ్వలేదని, బీజేపీ వచ్చాక మోడీ ఇవ్వరని భావించినప్పటికీ తన ఆలోచన తప్పని నిరూపించారని కర్నాటక ముస్లీం ఆర్టిస్ట్ ఖాద్రీ అన్నారు.
వైద్యుడి కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ డాక్టర్ తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. రెపో రేటులో ఎలాంటి మార్పు చేయకుండా 6.50 శాతం వద్ద వడ్డీ రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది.