రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో ఉన్నారని (Russian President Vladimir Putin’s health), ఆయన హెల్త్ గురించి డాక్టర్లు ఆందోళన చెందుతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. గత ఏడాదికి పైగా ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం (Russia-Ukraine war) కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఈ యుద్ధం (Russia-Ukraine war) కొనసాగుతుండగా మరోవైపు పుతిన్ ఆరోగ్యంపై (Putin Health) ఎప్పటికప్పుడు వదంతులు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఆయన ఆరోగ్యంపై (putin health updates) వార్తలు వచ్చాయి. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఆయన విపరీతమైన తలనొప్పి, కంటిచూపు మసకబారడం, తరుచు నాలుక తిమ్మిరిగా ఉండటం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ లక్షణాల పైన డాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం కుడి చేయి, కాలుకు స్పర్ష కోల్పోవడంతో పుతిన్ కు వైద్యులు అత్యవసర చికిత్స చేశారట. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో.. అందుకు ఆయన నిరాకరించారట. పైగా, ఉక్రెయిన్ పైన దాడికి సంబంధించిన నివేదికలను తీసుకున్నారట. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతూనే.. బంధువులు, కుటుంబ సభ్యులు పుతిన్ ఆరోగ్యంపై ఆందోళనగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రెండు నెలల క్రితం ఫిబ్రవరి నెలలోను అతని నడకను చూసిన వారు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోను (social media) పెద్ద ఎత్తున చర్చ సాగింది. పుతిన్ క్యాన్సర్ బారిన పడ్డారని, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు వచ్చాయి (Russian President is battling cancer and Parkinson’s disease). అయితే ఈ వార్తలకు ఆయన క్రిమియా సందర్శన, రష్యా సైనికుల కుటుంబ సభ్యులతో సమావేశం, చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ తో సమావేశం వంటి ద్వారా చెక్ పెట్టారు. ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏమంటే పుతిన్ ను (putin) అతని సన్నిహితులే (friends) చంపేస్తారని ఉక్రెయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది (Ukraine on Putin health).