BJP, BRS నాటకాలు.. 18న ఇందిరాపార్క్ వద్ద ధర్నా: మల్లు రవి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు మల్లు రవి అన్నారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై 18న దీక్ష చేపడుతామని తెలిపారు.
Mallu Ravi:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఉపాద్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) అన్నారు. ఈ రోజు ఆయన నాంపల్లిలో మీడియాతో మట్లాడారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్‌పై 18న దీక్ష చేపడుతామని తెలిపారు. అంతా కలిసి రావాలని కోరారు.
ఇందిరాపార్క్ (indira park) వద్ద నిరసన దీక్ష చేపడుతున్నామని తెలిపారు. దీక్షలో అఖిలపక్ష నేతలు.. విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతలు పాల్గొంటారని వివరించారు. పేపర్ లీకేజీకి సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని అడిగారు. సిట్ (sit) విచారణ కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు.
ఇటు ఈ నెల 17వ తేదీన వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల కూడా ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపడుతామని ప్రకటించారు. టీ సేవ్ పేరుతో అఖిలపక్ష నేలతో దీక్షకు దిగుతామని చెప్పారు. ఆ మరునాడే నిరసన దీక్ష అని మల్లు రవి ప్రకటన చేశారు. నిరుద్యోగుల సమస్యపై ప్రతిపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నాయి.
మరోవైపు సిట్ స్టేటస్ రిపోర్ట్‌ను (status report) హైకోర్టుకు (high court) సీల్డ్ కవర్లో అందజేసింది. ప్రవీణ్ (praveen), రాజశేఖర్ రెడ్డి (rajashekar reddy) ఇద్దరే సూత్రధారులు అని పేర్కొంది. వీరిద్దరూ కలిసి పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ టార్గెట్ చేశారని తెలిపింది. నిందితుల్లో ఒకరు న్యూజిలాండ్‌లో (new zealand) ఉన్నారని.. లుక్ అవుట్ నోటీసులు జారీచేశామని సిట్ పేర్కొంది. మిగిలిన 17 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. లీకేజీ వల్ల 4 పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. ఇది విద్యార్థులకు భారంగా మారనుంది. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.