Balineni Srinivasa Reddy:సీఎం జగన్ (Jagan) పర్యటనలో మాజీమంత్రి, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాస్ రెడ్డికి (Balineni Srinivasa Reddy) అవమానం జరిగింది. సీఎం జగన్ (jagan) ప్రకాశం (prakasam) జిల్లా మార్కాపురానికి ఈ రోజు వస్తున్నారు. పర్యటన నేపథ్యంలో జిల్లా నేతలు, అధికారులు మార్కాపురం చేరుకున్నారు. సీఎం జగన్ను (jagan) రిసీవ్ చేసుకునేందుకు బాలినేని కూడా వచ్చారు. కారులో హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
కారు (car) దిగి వెళ్లాలని బాలినేనికి సూచించారు. దీంతో ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మంత్రి ఆదిమూలపు సురేశ్ (suresh), జిల్లా ఎస్పీ, సహచర నేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivas) వినిపించుకోలేదు. అక్కడినుంచి తిరిగి ఒంగోలు వెళ్లిపోయినట్టు తెలిసింది. సీఎం పర్యటనకు హాజరుకాకుండానే వెళ్లిపోయారు.
వచ్చే ఎన్నికల్లో బాలినేనికి (Balineni) కూడా టికెట్ కన్ఫామ్ కాలేదని తెలిసింది. ఆ విషయమై ఇదివరకు బాలినేని (Balineni Srinivas) మాట్లాడారు. సీఎం జగన్ టికెట్ ఇవ్వనంటే తానేం చేయాలని కామెంట్ చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని వైసీపీ భావిస్తోంది. ఓడిపోయే నేతలు చాలా మంది ఉంటారని.. వారే టీడీపీ చెబుతోన్న సంఖ్య అని అధికార పార్టీ చెబుతోంది.
టికెట్ కేటాయింపు.. ఇతర అంశాలు ఏమో కానీ.. అవమానానికి గురవడంతో బాలినేని ఆగ్రహాంగా ఉన్నారు. సీఎం జగన్ (cm jagan) పర్యటనకు హాజరవకుండా వెళ్లిపోయారు. వైసీపీ పార్టీ పెద్దలు కావాలని చేస్తున్నారా? లేదంటే ప్రోటోకాల్ ప్రకారం జరిగిందో తెలియదు కానీ.. కొందరు నేతలను వైసీపీ దూరంగా పెడుతుందని స్పష్టంగా అర్థం అవుతుంది. ఏదో సందర్భం చూపి.. పక్కన పెడుతున్నారు. దీంతో వారే మెల్లిగా పక్కకు తప్పుకుంటున్నారు.