Corona కేసులు మళ్లీ పెరిగాయ్.. కొత్తగా ఎన్ని కేసులంటే
కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 7830 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరింది.
Coronavirus:కరోనా వైరస్ (Coronavirus) మళ్లీ హడలెత్తిస్తోంది. మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 7830 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేలకు చేరింది. దేశంలో ప్రస్తుతం 40125 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
పాజిటివిటీ రేటు 3.65 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 3.83 శాతంగా ఉంది. నిన్న దేశంలో 5676 కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 2154 కేసులు పెరిగాయి. కొన్ని రాష్ట్రాలు మళ్లీ మాస్క్ మ్యాండెటరీ చేశాయి. రెండేళ్ల క్రితం కూడా వేసవిలో (summer) కరోనా ఉగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మందులు వేసుకోకుండా.. తగిన ప్రీకాషన్ తీసుకొని వారు ప్రాణాలను కోల్పోయారు. తర్వాత ఒమైక్రాన్ వేరియంట్ వచ్చిన దాని ప్రభావం అంతగా లేదు. దీంతోపాటు దేశంలో మెజార్టీ పీపుల్ వ్యాక్సిన్ (vaccine) తీసుకున్నారు. కరోనా ప్రభావం అంతగా లేదు. జనాలు కూడా వైరస్ అంటే భయపడటం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకొని.. ఇంట్లోనే ఉంటున్నారు.