జూనియర్ ఎన్టీఆర్ (junior ntr), రామ్ చరణ్ (ram charan) హీరోలుగా, ఎస్ఎస్ రాజమౌళి (ss rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా (RRR cinema) ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్, సినీ క్రిటిక్స్ సహా ఎన్నో అవార్డులు దక్కించుకుంది. ఇందులోని నాటు నాటు పాటకు ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంక్ కేటగిరీలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును (Oscars 2023 award for rrr song) కూడా దక్కించుకున్నది (Naatu Naatu’ from film RRR wins the Best Original Song at 95th Academy Awards). ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాట పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియో గ్రాఫర్. ఈ పాట విడుదలైన నాటి నుండి అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలోని సంగీతం, సాహిత్యం, డ్యాన్స్… అన్నీ విశేషంగా అలరిస్తున్నాయి. ఇలాంటి పాటను ఇప్పుడు కర్నాటక బీజేపీ ఇప్పుడు తమ ఎన్నికల్లో ఉపయోగించుకుంటోంది. ఈ పాటను ఉపయోగించుకోవడం అంటే.. ఇదే డ్యాన్స్, ఇదే ట్యూన్ తో మోడీ పైన సాహిత్యంతో వచ్చిన ఓ ప్రచార సాంగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో కర్నాటకకు మోడీ ఏం చేశారో… నాటు నాటు పాట ట్యూన్, డ్యాన్స్ తో చెప్పారు.
ఆర్ఆర్ఆర్ నుండి ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు పాటను రీమిక్స్ చేసి, బీజేపీ తమ ప్రభుత్వ విజయాలను అందులో హైలెట్ చేశారు. దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్నాటక. ఇక్కడ కూడా ఓసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఆనవాయితీగా ఉంది. ఈ సెంటిమెంట్ ప్రకారం ఈసారి ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉంది. బీజేపీ రెండోసారి పగ్గాలు చేపడితే మాత్రం అది రికార్డ్ అవుతుంది. ఎన్నికలు మరో నెల రోజులు కూడా లేవు. ఇలాంటి సమయంలో బీజేపీ తమ గెలుపు కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఈ రీమిక్స్ పాటను విడుదల చేసింది. మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వంలో శివమొగ్గ విమానాశ్రయం, బెంగళూరు – మైసూరు ఎక్స్ ప్రెస్ వే, మెట్రో లైన్, హెల్త్ కార్డ్, ఇతర సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చాయని ఇందులో పేర్కొన్నారు.