‘Niharika’ Divorce : ‘నిహారిక’ విడాకులు కన్ఫామ్.. ఇదే సాక్ష్యం!
Niharika Divorce : సినిమా ఇండస్ట్రీలో విడాకులు కామన్. సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. నాగ చైతన్య, సమంత.. ధనుష్, ఐశ్వర్య.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా షాక్ గురి చేసిన విడాకులు అని చెప్పొచ్చు. అయితే హీరో, హీరోయిన్లు అంటే మ్యాటర్ వేరే ఉంటది.
సినిమా ఇండస్ట్రీలో విడాకులు కామన్. సెలబ్రెటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తున్నాయి. నాగ చైతన్య, సమంత.. ధనుష్, ఐశ్వర్య.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా షాక్ గురి చేసిన విడాకులు అని చెప్పొచ్చు. అయితే హీరో, హీరోయిన్లు అంటే మ్యాటర్ వేరే ఉంటది. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం విడాకుల వ్యవహారం ఎప్పుడు హాట్ టాపికే. చిరంజీవి కూతురు శ్రీజ డివోర్స్ మ్యాటర్ కొత్తగా.. ఎప్పటికప్పుడు వింటునే ఉన్నాం. ఇక ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకోబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది. 2020లో చైతన్య, నిహారికల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందని అనిపించుకుంది. కానీ ఈ మధ్య ఈ జోడి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది. దీంతో నిహారిక కొణిదెల, జొన్నలగడ్డ చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని నెట్టింట వార్తలు ఊపందుకున్నాయి. ముందుగా నిహారిక భర్త చైతన్య తన ఇన్స్టాగ్రామ్ నుంచి తమ పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేసుకున్నారు. ఇక్కడే విడాకుల పై సగం క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలో మెగాస్టార్ వీళ్లను కలిపే ప్రయత్నం చేస్తున్నారనే రూమర్ కూడా వినిపించింది. కానీ తాజాగా నిహారిక తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా నుండి డిలీట్ చేసింది. దీంతో అన్ అఫిషియ్గా నిహారిక డివోర్స్ కన్ఫామ్ చేసినట్టేనని అంటున్నారు. అయితే ఈ వార్తలపై నిహారికతో పాటు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. మరి ఈ వార్తలపై నాగబాబు క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.