మెగా ప్రిన్సెస్ నిహారిక.. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు అయ్యి సంవత్సరం అయ్యింది. తాజాగా ఈ విషయంపై ఆమె నోరు విప్పింది. దీంతో చైతన్య కౌంటర్ ఇచ్చాడు.
Chaitanya Jonnalagadda: మెగా ప్రిన్సెస్ నిహారిక.. చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు అయ్యి సంవత్సరం అయ్యింది. తాజాగా ఈ విషయంపై ఆమె నోరు విప్పింది. ఓ ఇంటర్వ్యూలో తన విడాకులపై నిహారిక మాట్లాడగా.. నెట్టింట వైరల్ గా మారింది. అయితే అది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి నచ్చడం లేదట. తన తాజా ఇంటరాక్షన్‌లో, నిహారిక కొణిదెల విడాకుల గురించి మాట్లాడింది. విడిపోవాలని ఎవరూ కోరుకోరని, విడిపోతామని.. అంత ఖర్చు చేసి ఎవరూ పెళ్లి చేసుకోరని నిహారిక అంది. తన విడాకుల విషయంలో తప్పు తనది కాదని.. తన మాజీ భర్తదే అంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. అయితే.. ఈ సమయంలో నిహారిక తన విడాకుల గురించి చర్చించడంతో మెగా అభిమానులు కలత చెందుతున్నారు.
ఇది కూడా చూడండి: Donald Trump: పరువు నష్టం కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. భారీ జరిమానా
విడాకులకు ముందు, ఆ తర్వాత క్లిష్ట సమయాలను ఎదుర్కొన్నానని, వేదన భరించలేక ఎన్నోసార్లు ఏడ్చానని నిహారిక వెల్లడించారు. మన పేరెంట్స్ ని తప్ప ఎవరినీ నమ్మకూడదని, నమ్మితే ఇలానే మోసపోతాం అని చెప్పింది. విడాకుల తర్వాత ఎక్కి ఎక్కి ఏడ్చానని నిహారిక తెలిపింది. ఆమె మాటలకు చైతన్య కౌంటర్ ఇచ్చాడు.
ఏదైనా ఒక అంశంలో రెండు వైపులా వాదనలు వినాలి. ఏకపక్షంగా ఆలోచించి అభిప్రాయాలను వెలిబుచ్చడం సరికాదు. అందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం మానుకోవాలి. పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయొద్దు. విడాకుల వంటి అంశాల్లో ఇద్దరికీ బాధ ఉంటుంది. ఇలాంటి అత్యంత ముఖ్యమైన విషయంలో ఒకరి వైపు నుంచే ఆలోచిస్తే ఎలా? అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఒకరి కోణంలోనే ఎలా నిర్ణయం వెలిబుచ్చుతారు? పైగా మీకు మీరే ప్రజలకు ఎలా చెబుతారు? ఇలాంటి విషయాల్లో అన్ని వైపుల వారితో మాట్లాడి, వారి అభిప్రాయాలను ప్రజలకు వెల్లడిస్తే బాగుంటుందని భావిస్తున్నా. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను” అంటూ జొన్నలగడ్డ చైతన్య తన కామెంట్ లో పేర్కొన్నారు.