Jharkhand violence: జార్ఖండ్ ఘటనలో పదుల సంఖ్యలో అరెస్ట్
జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలలో శాంతియుతంగా నిర్వహించుకుంటున్న శ్రీరామ నవమి శోభాయాత్ర పైన కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జార్ఖండ్ లోను (Jharkhand violence news) అదే పరిస్థితి కనిపించింది. ఇక్కడి జంషెడ్ పూర్ లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి 50 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వర్గానికి చెందిన మతపరమైన జెండాను అపవిత్రం చేశారనే కారణంగా ఆదివారం ఇక్కడి శాస్త్రినగర్ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. అల్లరిమూకలు విధ్వంసానికి పాల్పడ్డాయి. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
అల్లర్లకు పాల్పడిన కేసులో ఇరువర్గాలకు చెందిన యాభై ఐదు మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్టేషన్ కు వచ్చి అనుచితంగా ప్రవర్తించిన వారి పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు భారీగా పోలీసు బలగాలను, డ్రోన్లతో నిఘా టీమ్‌లను రంగంలోకి దింపినట్టు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. యథాపూర్వ పరిస్థితి తీసుకు వచ్చేందుకు శాంతి కమిటీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెబుతున్నారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, రెచ్చగొట్టే సందేశాలు వస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.