»Allu Arjun Join In Shahrukh Jawan Movie Shooting Is Complete
Shahrukh: జవాన్ చిత్రంలో అల్లు అర్జున్..షూటింగ్ కూడా కంప్లీట్?
బాలీవుడ్ హీరోలు.. మన హీరోలను గెస్ట్ రోల్ కోసం సంప్రదిస్తున్నారు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు సల్మాన్ ఖాన్. అయితే ఈసారి మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)..షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) జవాన్ మూవీలో గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ.. ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) రాబోయే చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అతిధి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పుష్ప నటుడు గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు అది దాదాపు 10 నిమిషాల పాటు ఉంటుందని తెలిసింది. అయితే ఈ వార్తపై అధికారిక ధృవీకరణ లేనందున గత కొన్ని రోజులుగా రూమర్‌గా మిగిలిపోయింది. కానీ తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఇప్పటికే జవన్ చిత్రం షూటింగ్లో పాల్గొన్నట్లు తెలిసింది.
అంతేకాదు త్వరలో రిలీజ్ కానున్న జవాన్ టీజర్లో కూడా బన్నీ కనిపించనున్నాడని సమాచారం. జవాన్(Jawan movie)లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం బన్నీని సంప్రదించాడట అట్లీ. పాత్ర నచ్చడంతో అల్లు అర్జున్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు టాక్. ఇక ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు. మరోవైపు ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొనే యాక్ట్ చేసినట్లు తెలిసింది.
ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నాడు. ఏదేమైనా.. బాలీవుడ్ బాద్షాకే బన్నీ గెస్ట్‌గా మారడం విశేషం. నయనతార(nayanthara) కథానాయికగా నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది. దీంతోపాటు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, యోగి బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 2, 2023న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.