»Louisville Shooting 5 Victims Killed Inside Bank 8 Injured
US shooting: అమెరికాలో మళ్లీ కాల్పులు, 5గురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. కెంటకీ రాష్ట్రంలోని లూయీస్ విల్లేలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం (firing in america) చోటు చేసుకున్నది. కెంటకీ రాష్ట్రంలోని లూయీస్ విల్లేలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు (shooting at a bank in Louisville, Kentucky). ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ పోలీసు అధికారి సహా ఏడుగురు గాయపడ్డారు. ఓ బ్యాంకు ఎదుట గుమికూడిన జనం పైకి దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్న బ్యాంకు భద్రతా సిబ్బంది అతని పైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం పోలీసులు ఈ ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడో తెలియరాలేదు. ఉదయాన్నే ఈ కాల్పుల ఘటన తెలిసి తాను తీవ్ర ఆందోళన చెందానని రపబ్లికన్ లీడర్ అండ్ కెన్టకీ సేన్ మిచ్ మెక్ కన్నెల్ అన్నారు. బాధితులకు అండగా ఉంటామని చెప్పారు.
ఈ ఘటన పైన లూయిస్ విల్లే మేయర్ క్రెయిగ్ గ్రీన్ బెర్గ్ కూడా స్పందించారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు పరిసర ప్రాంత ప్రజలు సంఘటన స్థలం సమీపంలోకి రావొద్దన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ అంజలి ఘటించారు. సంఘటన స్థలికి చేరుకున్న ఎఫ్బీఐ, ఏటీఎఫ్ బృందాలు ఘటనపై పూర్తి వివరాలు ఆరా తీస్తున్నాయి. ఇటీవలి కాలంలో అమెరికాలో కాల్పుల ఘటనలు హెచ్చుమీరుతున్నాయి. కాల్పుల ఘటనలు 2022లో 647 వరకు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా వరుసగా కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.