వైఎస్ వివేకా హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) తన ముందస్తు బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. సునీతకు, వివేకా రెండో భార్యకు మధ్య వివాదాలున్నాయని గుర్తు చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బృందం చర్చలు జరిపింది. పార్టీలోకి రావాలని కోరగా.. 10 సీట్లు ఇస్తేనే వస్తా అని పొంగులేటి స్పష్టంచేసినట్టు తెలిసింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. నాలుగేళ్ల తర్వాత ఏప్రిల్ నెలలో హై పవర్ డిమాండ్ నెలకొంది. పొద్దంతా ఎండలు ఉండగా.. సాయంత్రం ఉక్కపోతతో ఏసీలు, కూలర్లు ఆన్ చేయడంతో పవర్ డిమాండ్ ఎక్కువ అవుతుంది.
వైయస్ భాస్కర రెడ్డి అరెస్టుపై మంత్రి ఆదిమూలపు సురేష్ కొద్ది గంటల్లోనే మాట మార్చారు. తొలుత చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న ఆయన ఆ తర్వాత మాత్రం భాస్కర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు.
మద్యం మత్తు, మాదకద్రవ్యాలు సేవించిన మత్తులో ఓ వ్యక్తి తన కారుపై ట్రాఫిక్ పోలీసును దాదాపు పంతొమ్మిది కిలో మీటర్లు లాక్కెళ్లిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
ఎండాకాలం కావడంతో ఈ కార్యక్రమానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కానీ వాటిని పట్టించుకోలేదు. సభకు హాజరైన వారికి నీడ సౌకర్యం కల్పించలేదు. తీవ్రమైన ఎండలకు ప్రజలు తాళలేక అస్వస్థతకు గురయ్యాయి. ఏకంగా 600 మంది అస్వస్థతకు లోనయ్యారు.