తన మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ ల వల్లే తాను ఈ రోజు ఈ స్టేజీ మీద నిలబడ్డానని టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ అన్నారు. కాలర్ ఎగిరేసేలా ఈ సినిమా ఉంటుందన్నారు. తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్త మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి. సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజీ మైదానంలో ఆదివారం (ఏప్రిల్ 16) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడాడు.
‘అమ్మా ఐ లవ్యూ.. ఈ సినిమాను నీ కోసం, వైష్ణవ్ కోసం చేశాను అమ్మా. 2009లో నా సినిమా జర్నీ మొదలైంది. ఐదేళ్ల తరువాత నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది. 2016 వరకి వెనక్కి చూసుకోవాల్సిన పని లేదు. ఆడియెన్స్ నన్ను యాక్సెప్ట్ చేసి, హిట్లు ఇచ్చారు. ఆ తరువాత వరుసగా ఆరు ఫ్లాపులు వచ్చాయి. నన్ను నేను రీ కరెక్ట్ చేసుకున్నాను. 2019 ఏప్రిల్ వరకు నేర్చుకుంటూనే ఉన్నాను. చిత్రలహరి సినిమాతో బయటకు వచ్చాను. ఆ సినిమాకు సుకుమార్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. నా కమ్ బ్యాక్ సినిమాకు చీఫ్ గెస్టుగా వచ్చారు. ఇప్పుడు మళ్లీ నా సినిమాకు నిర్మాత అయ్యారు. ఆ సినిమా తరువాత కాస్త మంచి చిత్రాలే వచ్చాయి. 2019, 20 వచ్చింది. లాక్ డౌన్ వచ్చింది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా వచ్చింది. అత్తారింటికి దారేది సినిమా షూటింగ్‌కు వెళ్తే ప్రసాద్ గారు నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. బాపీ అన్న కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.
వారు గర్వపడేలా చేయాలి
2021 సెప్టెంబర్ 10 నేను అనుకోకుండా బైక్ మీద జారి పడ్డాను. బైక్ నడపడం తప్పు అని నేను అనుకోను. నాకు బైక్ అంటే ప్రాణం. సెప్టెంబర్ 16, 17 డేట్ సరిగ్గా గుర్తు లేదు. లేవగానే అమ్మ, తమ్ముడు కనిపించాడు. కానీ ఏం మాట్లాడలేకపోయాను. సారీ, ఐ లవ్యూ కూడా చెప్పలేకపోయాను. కడుపులో బాధ వచ్చింది. ఏంటో అర్థం కాలేదు. డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్లాం. నిలబడలేకపోతున్నాను. మాట రావడం లేదు. కంట్లో ఏడుపు, గుండెల్లో గుబులు వచ్చింది. బాధ వల్ల.. నొప్పి కలగడం, జీవితాల్ని మార్చడం జరుగుతుంది. ఎలాగైనా సరే మాట్లాడాలని అనుకున్నాను. కష్టపడ్డ, బాధపడ్డ, మీ ప్రేమను పొందాను. ఎంత కష్టపడ్డా కూడా మీ ప్రేమను పొందుతూనే ఉంటాను. నేను ఈ కథ అంతా సింపతీ కోసం చెప్పలేదు. మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తుందని చెప్పాను. మీ అమ్మ, నాన్న, గురువులు గర్వపడేలా చేయాలి. మేలుకో, లేచి నిలబడు.. అమ్మానాన్నలు, గురువులు గర్వపడేలా చేయండి. మీరంతా కూడా కష్టపడి గొప్పవాళ్లు అవ్వాలి. నాకు అప్పుడే ఆనందంగా ఉంటుంది.
ప్రేమించే అమ్మాయిని కాకుండా..
బైక్ నడుపుతూ ఉంటే.. అందరూ హెల్మెట్‌ను వాడండి. అబ్బాయిలంతా కలిసి.. అమ్మాయిలకు మంచి ప్రపంచాన్ని క్రియేట్ చేద్దాం. మీరు ప్రేమించే అమ్మాయిని కాకుండా మిగతా అందరిలోనూ అమ్మను చూడండి. అబ్బాయిలు తప్పు చేస్తే అమ్మాయిలు క్షమించండి. ఈ సినిమాను ఏప్రిల్ 21న రాబోతోంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది. మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాం. తేజ్ నీ కోసం మంచి కథను పంపిస్తాను విను అని సుకుమార్ గారు అన్నారు. మంచి లవ్ స్టోరీ పంపిస్తారని అనుకున్నాను. కానీ భయపెట్టే కథను పంపించారు. అసలే హారర్ సినిమా అంటే నాకు భయం. అద్భుతంగా నెరెట్ చేశాడు కార్తిక్. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. మా నిర్మాతలు బాపీ అన్నా, ప్రసాద్ గారికి థాంక్స్. నాకు అండగా నిలబడ్డారు. ఎంతో సపోర్ట్ చేశారు. శ్యాం గారి లైటింగ్ అద్భుతంగా ఉంది. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారి సెట్లు చూస్తే ఆడియెన్స్ భయపడతారు. అజనీష్ గారి ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. మీ అందరి ప్రేమను పొందేందుకు సినిమాలతో వస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన ఆ గురువు, దేవుడికి థాంక్స్. ఆయన నాకు చాన్స్ ఇచ్చారు. 2009లోనే ఆయన నన్ను నమ్మారు. నా గురువుతో కలిసి సినిమా చేసే అవకాశం ఇచ్చిన సముద్రఖని గారికి థాంక్స్’ అని సాయి ధరమ్ తేజ్ ముగించారు.
నటుడిగా సాయికి పునర్జన్మ: సుకుమార్
విరూపాక్ష సినిమా గురించి చాలా చెప్పాలని, అంతకుముందే మరో మంచి కథతో వచ్చారని, కానీ తనకు కథ నచ్చలేదని, కానీ నెరేషన్ బాగా అనిపించిందని గుర్తు చేసుకున్నారు సుకుమార్. తనకు కథ నచ్చకపోవడంతో వేరే కథ చెప్పమని అడిగానని, అప్పుడు ఈ విరూపాక్షను చెప్పాడన్నారు. ఇది అద్భుతంగా అనిపించిందని, ఆ తరువాత బాపిని పిలిపించి.. కథను చెప్పించానని, కార్తీక్ లైఫ్ చాలా క్రిటికల్ కండీషన్లో తన వద్దకు వచ్చాడని, మెడికల్ ప్రాబ్లం నుంచి బయటపడి.. ఈ సినిమాను డైరెక్ట్ చేశాడన్నారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడన్నారు. ముందుకు వెళ్లడానికి మేం కాస్త సాయం చేశామని, కథను బాగా రాసుకున్నాడని, సినిమాను కూడా బాగా తీశాడన్నారు. ఈ సినిమా మంచి హిట్ కావాలని, అలాగే పరిశ్రమలో మంచి దర్శకుడిగా నిలబడాలని ఆకాంక్షించారు.
సుకుమార్ ఇంకా మాట్లాడుతూ… జగడం సినిమా ప్లాప్ నన్ను ఎవ్వరూ నమ్మలేదు. కానీ ప్రసాద్ గారు నమ్మారు. నాకు నెలకు కొంత డబ్బు ఇస్తూనే వచ్చారు. శ్యాం గారి విజువల్స్ అద్భుతంగా ఉంటాయి. విరూపాక్ష సినిమా హిట్ అయితే ఆయనకే మేజర్ క్రెడిట్ దక్కుతుంది. అజనీష్ అద్భుతమైన ఆర్ఆర్, సౌండ్ డిజైనింగ్ చేశాడు. నాగేంద్ర గారి సెట్లు అద్భుతంగా అనిపించాయి. అవి అసలు సెట్స్‌లానే అనిపించలేదు. ఎంతో నేచురల్‌గా కనిపించాయి. నవీన్‌తో నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు చేశాను. సంయుక్త తెలుగు చాలా చక్కగా మాట్లాడింది. ఈ పాత్రకు సంయుక్తను తీసుకుంటాను అని అంటే ముందు నేను భయపడ్డాను. కానీ ఆమె అద్భుతంగా నటించింది. దిల్ రాజు గారి అమ్మాయి పెళ్లికి వెళ్లాం. అప్పుడే నేను సాయిని కలిశాను. అందర్నీ నవ్విస్తూనే ఉంటాడు. విరూపాక్ష సెట్లో మళ్లీ చూశాను. కానీ ఆ రోజు సెట్లో ఒక్కొక్క అక్షరాన్ని పట్టి పట్టి నేర్చుకుంటున్నాడు. ఇది ఆయనకు నటుడిగానూ పునర్జన్మలాంటిది. ఆ ప్రమాదం జరిగిన తరువాత సాయి నటించిన మొదటి సినిమా. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇదే గ్రౌండ్లో ఆటలు ఆడాం. నేను ఇక్కడే చదువుకున్నాను. సుకుమార్ గారితో కలిసి ఈ సినిమాను నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాకు ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. ఇది మంచి చిత్రం అవుతుందన్నారు.
దర్శకులు కార్తిక్ దండు మాట్లాడుతూ.. ‘రాజమౌళి, కీరవాణి వల్ల మన సినిమా ప్రపంచం చూస్తోంది. ఎన్టీఆర్ గారి వాయిస్ వల్ల ఈ సినిమాకు పవర్ వచ్చింది. సినిమా టీజర్‌ను చూసి పవర్ స్టార్ మెచ్చుకున్నారు. సుకుమార్ గారు ఈ కథ విని.. స్క్రీన్ ప్లే చేస్తాను, ప్రొడ్యూస్ చేస్తాను అని అన్నారు. అయితే ఇంకా పెద్ద స్థాయిలో సినిమాను తీయాలని బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి చెప్పారు. ఈ సినిమాను ఇంత గొప్పగా నిర్మించిన ప్రసాద్ గారికి థాంక్స్. సాయి ధరమ్ తేజ్ గారు చాలా మంచి వారని అందరూ చెబుతుండేవారు. అయితే ఆయనతో పని చేసిన తరువాత నాకు మరింతగా అర్థమైంది. ఆయనకు ఈ సినిమా కెరీర్ పాథ్ బ్రేకింగ్ సినిమా అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. ఈ సినిమాను ఇంత గొప్పగా నిర్మించిన బాపీ, ప్రసాద్ గారికి థాంక్స్. సినిమాను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ చేశారు. ఈ సినిమాలో భాగస్వామి అయిన సంయుక్తకు థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో నటీనటులు కాకుండా నేను సృష్టించిన పాత్రలే కనిపిస్తాయి. సినిమాను పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నేను అనుకున్న విజన్‌ను శ్యాం సర్ అద్భుతంగా చూపించారు. నాగేంద్ర గారి రుద్రవనంను అద్భుతంగా నిర్మించారు. అజనీష్ ఆర్ఆర్ సినిమాకు ప్లస్ అవుతుంది. అద్భుతంగా సౌండ్ డిజైన్ చేశారు. సినిమాకు మొదటి ఆడియెన్ ఎడిటర్. మూడు గంటల సినిమా ఇస్తే.. రెండు గంటల 24 నిమిషాల సినిమా ఇచ్చాడు. ఏ ఒక్క ఎమోషన్ మిస్ అవ్వకుండా అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చిన నవీన్‌కు థాంక్స్. రాజశేఖర్ చేసిన డీటీఎస్ మిక్స్ అద్భుతంగా ఉంటుంది. నాకు హారర్ సినిమాలంటే ఇష్టం. నేను ఈ సినిమాతో హారర్ జానర్ రుణం తీర్చుకున్నాను’ అని అన్నారు.
సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. ‘ప్రేమతో ఈ సినిమాను చేశాం. అందరం కలిసి ఈ సినిమాను చేశాం. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నన్ను నమ్మి నందిని అనే పాత్రను ఇచ్చినందుకు థాంక్స్. శ్యాం సర్ గారు ఇచ్చిన మాట ప్రకారం నన్ను అద్భుతంగా చూపించారు. కార్తిక్ గారి వల్ల నాలోని యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లేలా చేశారు. అజనీష్ గారి సంగీతం ఓ డివైన్లాంటిది. ఈ సినిమాతో తేజ్ కమ్ బ్యాక్ అవ్వాలి. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సుకుమార్ తగ్గేదేలే అంటూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. అందరూ థియేటర్లో ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.
సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో రెండు మెలోడీ పాటలు, ఒక మాస్ నంబర్ ఉంటాయి. విరూపాక్ష లాంటి కథకు ఆర్ఆర్, సంగీతం ఇవ్వడం నాకు ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నా బ్రదర్ సాయి ధరమ్ తేజ్, సుకుమార్ గారికి థాంక్స్. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో గ్రేట్ ఆర్ఆర్, గ్రేట్ సౌండ్ డిజైనింగ్ ఉంటుంది. థియేటర్లోనే ఆ అనుభూతి వస్తుంది. మిస్ అవ్వకండి’ అని అన్నారు.
లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘సాయి ధరమ్ తేజ్ గారికి ప్రమాదం జరిగినప్పుడు ఎంతగా భయపడ్డామో.. ఈ సినిమాను చూస్తే అంత భయపడతాం.. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు అంతకు మించి సంతోషంగా బయటకు వస్తాం. ఈ సినిమాను కార్తీక్ దండు అంత అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాతలు ఈ సినిమాను ఎంతో గొప్పగా నిర్మించారు. రేపు భయపడబోతోన్న అభిమానులకు శుభాకాంక్షలు’ అని అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది. ఈ సినిమాకు నేను పని చేయడమే ప్రౌడ్ మూమెంట్. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అందరం సినిమాను నమ్మి చేశాం. నిర్మాత బాపిగారికి థాంక్స్. థ్రిల్లర్ మూవీని ఒకసారి చూస్తే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. రెండో సారి చూస్తే అంతగా అనిపించదు. కానీ ఈ సినిమాను ఎన్ని సార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. ఇంకో లేయర్ కనిపిస్తూ ఉంటుంది. కెమెరామెన్ శ్యామ్ గారితో నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. సాయి ధరమ్ తేజ్ గారి కళ్లు ఎంతో షార్ప్‌గా ఉంటాయి. సినిమాను అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
సాయిచంద్ మాట్లాడుతూ.. ‘సుకుమార్ దర్శకత్వంలో ఇది వరకే పని చేయాల్సింది. కానీ మిస్ అయింది. కానీ అతని శిష్యుల వద్ద మాత్రం కంటిన్యూగా పని చేస్తున్నాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. బీవీఎస్ఎన్ గారిది, నా సినిమా ప్రయాణం ఒకేసారి మొదలైంది. శ్యాం గారితో ఇది వరకు ఉప్పెనలో పని చేశాను. సంయుక్త గోల్డెన్ లెగ్. ఎంతో నమ్మకంగా ఈ సినిమాను చేశాం. ఈ సినిమా అద్భుత విజయం సాధించబోతోంది. సాయి తేజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ సినిమాతో ఇంకా ఎత్తుకు ఎదుగుతాడు. సాయి ధరమ్ తేజ్‌తో పని చేస్తే.. మంచుపల్లకిలో చిరంజీవితో పని చేసినట్టుగా నాకు అనిపించింది. సాయి తేజ్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
అంబికా కృష్ణ మాట్లాడుతూ.. ‘భోగవల్లి ప్రసాద్ గారు అద్భుతమైన సినిమాలు తీస్తుంటారు. ఇప్పుడు ఇండస్ట్రీ మూడు పువ్వులు అరవై కాయలు అన్నట్టుగా ఉంది. ఇలాంటి టైంలో ఈ సినిమా హిట్ అవ్వాలి.. నిర్మాతకు డబ్బులు రావాలి. సాయి ధరమ్ తేజ్ గారికి చిరంజీవి గారి పోలికలు పూర్తిగా వచ్చాయి. పుష్ప అనేది చరిత్ర. అలాంటి సుకుమార్ ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా ఉండటమే ఈ సినిమా సక్సెస్. విరూపాక్ష అంటే శివుడి మూడో కన్ను. ట్రైలర్ చూస్తుంటేనే ఈ సినిమా హిట్ అవుతుందని అర్థం అవుతోంది. సంయుక్త మన తెలుగు ఇండస్ట్రీకి గోల్డెన్ లెగ్’ అని అన్నారు.
బాలకృష్ణ రావు మాట్లాడుతూ.. ‘సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుంచి తప్పించుకుని మృత్యుంజయుడిలా తిరిగి వచ్చారు. ఈ సినిమాలో నటించిన, పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఏలూరులో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరగలేదు. గ్యాంగ్ లీడర్, లక్ష్మీ సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లు జరిగాయి. మళ్లీ ఇప్పుడు విరూపాక్ష ఈవెంట్ జరుగుతోంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కెమెరామెన్ శ్యాం దత్ మాట్లాడుతూ.. ‘మెగా ఫ్యామిలీలో ఇది నాకు మూడో సినిమా. నాకు అంతగా తెలుగు రాదు. ఇక్కడ అందరినీ చూస్తుంటే సంతోషంగా ఉంది. నా వర్క్ అంతా కూడా కెమెరా వెనకాల ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాను చూసి ఆడియెన్స్ ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
మహి బాబు మాట్లాడుతూ.. ‘సాయి ధరమ్ తేజ్ గారి విరూపాక్ష సినిమా ఈవెంట్ ఏలూరులో జరుగుతుండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మాగంటి బాబు.. ‘చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ సినిమా వంద రోజుల ఫంక్షన్‌ను ఇక్కడ నిర్వహించాం. మళ్లీ ఇప్పుడు అదే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామ’ని అన్నారు.
చంటి మాట్లాడుతూ.. ‘మా మేనమామ ఎస్వీ రంగరావు గారు ఇక్కడే చదువుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక్కడే చదువుకున్నారు. విరూపాక్ష సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.